అంతర్రాష్ట్ర జల వివాదాలకులు ఒకే ట్రిబ్యునల్

అంతర్ రాష్ట్ర నదీ జలాలు, నదీలోయలకు సంబంధించిన వివాదాల్ని త్వరితగతిన పరిష్కరించేందు కు తోడ్పడే ఒక బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అంతరరా ష్ట్ర నదీ జలాల వివాదాల్ని దారికి తె చ్చి, ఒక పద్ధతిలో పెట్టేందుకు 1956లో అంతర్‌రాష్ట్ర నదీ జల వివాదాల చట్టాన్ని తెచ్చారు. ఇప్పుడు ఆ చ ట్టా న్ని సవరించాలని తాజా బిల్లు కోరుతోంది.

బిల్లులో ముఖ్యాంశం …ఒక సింగిల్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడం. అందులో వివిధ రంగాలకు చెందిన విభాగాలను ఏర్పాటు చేయడం. పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు జడ్జి ట్రిబ్యునల్‌కు సారథ్యం వహిస్తారు. అయితే, రాష్ట్రాలను సంప్రదించకుండా బిల్లు ప్రవేశపె ట్టారని ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ అంశంపై మాట్లాడుతూ 2013లో రాష్ట్రాలను సంప్రదించాం. 2017 ఇదేమాదిరి బిల్లు ఒకటి లోక్‌సభలో తెచ్చాం. దాన్ని అప్పట్లో స్టాండింగ్ కమిటీకి పంపించారు. అయితే, 16వ లోక్‌సభ కాలపరిమితి ముగియడంతో ముసాయిదా చట్టం రద్దయిందని తెలిపారు.

‘జలవివాదాల పరిష్కారానికి తొమ్మిది ట్రిబ్యునల్స్ ఉన్నాయి. వాటిలో నాలుగు కమిటీలు తమ రిపోర్టు ఇవ్వడానికి 10 నుంచి 28 ఏళ్లు తీసుకున్నాయి. వివాదాల పరిష్కారానికి కాలనియమం అంటూ లేదు. ట్రిబ్యునళ్ల కాలపరిమితిని కూడా నిరవధికంగా పెంచారు’ అని సవరణ బిల్లుకు మద్దతుగా మంత్రి చెప్పారు. వివాదాల్ని వేగంగా పరిష్కరించేందుకు అలాంటి చట్టాలు అవసరమని బిజెపి సభ్యుడు నిషికాంత్ దుబే అభిప్రాయపడ్డారు. లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు ఆధిర్ రంజన్ చౌదరి, బి. మహతాబ్ (బిజెడి), టిఆర్ బాలు బిల్లును వ్యతిరేకించారు.

నదీజలాలు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి రాష్ట్రాలను సంప్రదించారా లేదా అన్నది బిల్లులో లేదని వారు అభ్యంతరం తెలిపారు. బిల్లు ఉద్దేశంలో సందేహం లేదని, అయితే రాష్ట్రాల్ని సంప్రదించాలని మెహతాబ్ చెప్పారు. రాత్రికి రాత్రే బిల్లు తెచ్చారని, ఇలాంటి ప్రతిపాదనల గురించి రాష్ట్రాలకు తెలీదు కనుక, ప్రభుత్వం చట్టాల్ని అణచేస్తోందని విమర్శించారు.

ప్రస్తుతం ఉన్న విభిన్న ట్రైబ్యునళ్ల స్థానంలో ఒకే శాశ్వత ట్రైబ్యునల్‌ ఏర్పాటును కేంద్రం ప్రతిపాదించింది. వివాదాలను వేగŸంగా పరిష్కరించేందుకు స్పష్టమైన నిబంధనలను బిల్లులో పొందుపరిచింది. వివాదం ట్రైబ్యునల్‌ వద్దకు వెళ్లిన తర్వాత గరిష్ఠంగా నాలుగున్నర ఏళ్ల లోపే పరిష్కరించాలని ప్రతిపాదిత బిల్లు నిర్దేశిస్తోంది. ఒక్కసారి ట్రైబ్యునల్‌ తీర్పు వెలువరిస్తే అదే అంతిమం. వివాదంతో సంబంధం ఉన్న రాష్ట్రాలన్నీ తప్పనిసరిగా ఆ తీర్పును శిరసావహించాల్సిందే.

ఇప్పటిలా అధికారిక గెజిట్‌లో ప్రచురించాల్సిన అవసరం ఉండదు. ప్రతిపాదిత ట్రైబ్యునల్‌ మనుగడలోకి వచ్చిన నాటి నుంచి అప్పటి వరకూ పనిచేస్తున్న ట్రైబ్యునళ్లన్నీ రద్దవుతాయి. ప్రస్తుతం వాటి ముందున్న కేసులన్నీ ఈ కొత్త ట్రైబ్యునల్‌కు బదిలీ అవుతాయి. జల వివాదంపై విచారణ జరపటానికి ట్రైబ్యునల్‌లో బెంచ్‌ ఏర్పాటవుతుంది.

కొత్త ట్రైబ్యునల్‌లో ఒక ఛైర్మన్‌, ఒక వైస్‌ఛైర్మన్‌, ఆరుగురు సభ్యులు ఉంటారు. ఇందులో ముగ్గురు న్యాయ వ్యవస్థకు చెందిన వారు కాగా మరో ముగ్గురు జల వనరుల రంగ నిపుణులు. ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ల గరిష్ఠ పదవీ కాలం అయిదేళ్లు. లేదా 70 ఏళ్ల వయస్సు వరకు. మిగతా సభ్యులు 67 ఏళ్ల వయస్సు తర్వాత కొనసాగడానికి వీల్లేదు.