భారతీయుల ఆరాధ్యుడు మోడీ

భారతదేశంలోని అత్యంత ఆరాధనీయ వ్యక్తులలో మొదటి స్థానం ప్రధాని నరేంద్ర మోడీకి దక్కింది. లండన్‌కు చెందిన ఒక మార్కెట్ రిసెర్చ్ సంస్థ తన సర్వే ఫలితాలను శనివారం వెల్లడించింది. 2019లో ప్రపంచంలోని అత్యంత ఆరాధనీయ వ్యక్తులలో మోదీ ఆరవ స్థానం సంపాదించుకున్నారని ఆ సంస్థ తెలిపింది. 

YouGov.Boxer Mary Kom విడుదల చేసిన జాబితా ప్రకారం గత ఏడాది 8వ స్థానంలో ఉన్న మోదీ పేరు ఈసారి 6వ స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ రాజకీయవేత్త మోదీ మాత్రమే కావడం విశేషం. ఈ జాబితాలో ప్రథమ స్థానంలో బిల్ గేట్స్ ఉండగా, ద్వితీయ స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉన్నారు. ప్రపంచంలోని ఆరాధనీయ మహిళలలో ఒబామా సతీమణి మిషెల్ ఒబామా, అమెరికన్ టీవీ సెలెబ్రిబీ ఓప్రా విన్‌ఫ్రే ఉన్నారు. 

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పొందిన మోదీ స్కోరు 4.8 శాతం ఉన్నట్లు సంస్థ తన సర్వే వివరాలను ప్రకటించింది. ప్రపంచంలోని ఆరాధనీయ వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న తొలి 20 మంది వ్యక్తులలో బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఉన్నారు. 

ప్రపంచంలోని ఆరాధనీయ మహిళల జాబితాలో తొలి 20 మంది మహిళలలో బాలీవుడ్ తారలు దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్ ఉన్నారు. భారతదేశంలో అత్యంత ఆరాధనీయ వ్యక్తులలో రెండవ స్థానంలో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు. తర్వాత స్థానంలో వ్యాపారవేత్త రతన్ టాటా ఉన్నారు. దేశంలో అత్యంత ఆరాధనీయ మహిళలలో మేరీ కోమ్, కిరణ్ బేడీ, లతా మంగేష్కర్, సుష్మా స్వరాజ్, దీపికా పదుకొనె ఉన్నారు.