సోనియా బృందంతోనే 2019 ఎన్నికల పర్యవేక్షణ

కుమారుడు రాహుల్ గాంధీకి పార్టీ అద్యక్ష పదవిని అప్పచేప్పినా 2019 ఎన్నికల బాధ్యతను కుడా అప్పచేప్పడానికి సోనియా గాంధీ వెనుకడుగు వేస్తున్నారు. అందుకనే వచ్చే ఎన్నికలలో రాహుల్ బృందానికి పెద్దగా ప్రాధాన్యత లభించే అవకాశాలు లభించడం లేదు. పార్టీ అద్యక్షుడు మారినా ఇంకా పార్టీలో పెత్తనం సోనియా సన్నిహితులదే సాగుతున్నది.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అద్యక్ష పదవి చేపట్టగానే పార్టీలోను `వృద్ద తరం’ నాయకులను పక్కన పెట్టి, యువతరం అన్ని స్థాయిలలో నాయకత్వ బాధ్యతలను చేబడుతుందని రెండేళ్లుగా జరుగుతున్న ప్రచారానికి కాంగ్రెస్ తెర దించింది. సుమారు రెండు శతాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై ఆధిపత్యం వహిస్తున్న సోనియా గాంధీ హయమలో పార్టీ వ్యవహారాలపై పెత్తనం సాగుస్తూ వస్తున్న వృద్దతరం సారధ్యంలోనే 2019 ఎన్నికలను ఎడుర్కొబోతున్నరన్న స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి.

రాహుల్ గాంధీ బృందంలోని యువనాయకులకు ఇంకా చెప్పుకోదగినంత ప్రజాదరణ లేకపోవడం, రాజకీయ ఎత్తుగడలలో వారికి తగిన అనుభవం లేకపోవడం, ముఖ్యంగా ఇతర పార్టీ నేతలతో చెప్పుకోదగిన సంబంధాలు లేకపోవడంతో వారికి సారధ్యం అప్పచెబితే పార్టీ ముందుకు వెళ్ళడం అసాధ్యమని నిర్ణయానికి వచ్చిన్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ అస్తిత్వ సమస్యను ఎదుర్కొంటున్నది.

కాంగ్రెస్ సారధ్యంలో పనిచేయడానికి దేశంలో ఏ రాజకీయ పక్షం, రాజకీయ నేత ముందుకు రావడం లేదు. తమ సారధ్యంలో కాంగ్రెస్ పని చేయాలనే ధోరణిని మమత బెనర్జీ, మాయావతి, శరద్ పవర్ వంటి నేతలు వ్యక్తం చేస్తున్నారు. అటువంటి నాయకులతో మాట్లాడి, రాజకీయ వ్యవహారాలను సరిదిద్దగల స్థాయి రాహుల్ గాంధీకి కుడా ఇంకా అలవడలేదు.

పార్టీ అద్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి పార్టీలో వివిధ స్థాయిలలో పలువురు యువ నేతలకు రాహుల్ ప్రాధాన్యత ఇస్తూ వచ్చినప్పటికీ `సోనియా బృందం’ ఇంకా కీలక నిర్ణయాలు తీసుకొంటున్నది. నరేంద్ర మోడీ వంటి బలమైన నాయకుడిని, 19 రాష్ట్రాలో ప్రభుత్వాలు ఏర్పరచిన బిజెపిని ఎదుర్కోవడం యువనేతలకు సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారు.

పార్టీ సంస్థాగత వ్యవహారాలు నుండి, పార్టీకి నిధులు సమకూర్చడం, ఇతర రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరపడం వంటి అన్ని వ్యవహారాలను సీనియర్ నేతలే పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్ చరిత్రలో మొదటి సారిగా తొమ్మిది మంది సభ్యులతో కోర్ కమిటీని ఏర్పాటు చేసారు. 2019 ఎన్నికలకు సంబంధించి అన్ని వ్యవహారాలు పర్యవేక్షించడం కోసం తొమ్మిది నెలల ముందే ఈ కమిటీని ఏర్పాటు చేసారు. ఈ కమిటీలో ఏడుగురు సోనియా గాంధీతో దీర్ఘకాలంగా సన్నిహితంగా పనిచేస్తున్న వారే ఉండటం గమనార్హం.

వారు రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబి ఆజాద్, కొత్తగా పార్టీ కోశాధికారి బాధ్యతలు చేపట్టిన అహ్మద్ పటేల్, మాజీ కేంద్ర మంత్రులు ఏ కే అంటోని, పి చిదంబరం, మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్. రాహుల్ కు సన్నిహితంగా ఉండే వారిద్దరే – కె సి వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాల ఈ కమిటీలో స్థానం పొందగలిగారు.

2014 ఎన్నికలలో పార్టీలో కీలక పాత్ర వహించిన దిగ్విజయ్ సింగ్, జనార్ధన్ ద్వివేది మాత్రమె ఈ పర్యాయం ఎక్కడా పార్టీ వ్యవహారాలలో కనిపించడం లేదు. మాజీ కోశాధికారి మోతిలాల్ ఒరాను మాత్రం ప్రధాన కార్యదర్శిగా చేసి పార్టీ వ్యవహారాలను అప్పచెప్పారు.

కోర్ గ్రూప్ సభ్యుడిగా ఉండడంతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాలకు సహితం గేహ్లోట్ ను ఇన్ చార్జ్ గా చేసారు. సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శిగా దీర్ఘకాలం పార్టీ వ్యవహారాలలో కీలక భూమిక వ్యవహరించిన అహ్మద్ పటేల్ తీవ్రమైన నిధుల కొరత ఎడుర్కొంతున్న పార్టీకి కోశాధికారి అయ్యారు. ఇక ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపి, పోత్తులకు రంగం సిద్దం చేసే బాధ్యతలను పటేల్, ఆజాద్ లకు అప్పజెప్పారు. పైగా కీలకమైన ఉత్తర ప్రదేశ్ కు ఇంచార్జ్ గా కుడా ఆజాద్ ను నీయమించారు.

రాహుల్ గాంధీ దేశంలో లేని సమయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేపట్టే విధంగా పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా `భారత్ బంద్’ సెప్టెంబర్ 10న జరపాలని పార్టీ సీనియర్ నేతలు ఓర, పటేల్, ఖర్గే, గేహ్లోట్ సంయుక్తంగా పిలుపిచ్చారు. ఖర్గే కి ఈ మధ్య కీలకమైన మహారాష్ట్ర బాధ్యతలను కుడా అప్పజెప్పారు. శరద్ పవర్ వంటి నేతలతో సంప్రదింపులు జరపడానికి సీనియర్ నేత ఒకరు కావాలని ఆయనను నీయమించారు.

అయితే రాజకీయంగా అంతగా ప్రాధాన్యత లేని  19 మందితో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రణాళిక కమిటీలో సేనియర్లు ముగ్గురు – పి చిదంబరం, సల్మాన్ ఖుర్షిద్, భూపిందర్ సింగ్ హూడా మాత్రమె ఉన్నారు. మిగిలిన వారంతా సుష్మిత దేవ్, మాన్ ప్రీత్ బాదల్, ముకుల్ సంగమ వంటి యువనేతలు ఉన్నారు. అట్లాగే 13 మందితో ఏర్పాటు చేసిన ప్రచార కమిటీలో కుడా ఆనంద్ శర్మ, ప్రమోద్ తివారి, భక్త చరణ్ దాస్ – ముగ్గురే సేనియర్లు ఉన్నారు. మనిష్ తివారి, దివ్య స్పందన, మిలింద్ దేఒర వంటి యువకులే ఎక్కువగా ఉన్నారు.