పెట్రోల్ ధరలు తగ్గించిన రాజస్తాన్

ప్రతిపక్షాల పిలుపు మేరకు పెరుగుతున్న చమురు ధరలకు నిరసనగా `భారత్ బంద్’ ప్రారంభం కాకమునుపే రాజస్తాన్ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై వాట్ ను 4 శాతం తగ్గించింది. దానితో గత రాత్రి నుండే లీటర్ కు రూ 2.50 వరకు ధరలు తగ్గుముఖం పట్టాయి.

జైపూర్ లో ఆదివారం పెట్రోల్ ధర లీటర్ కు రూ 83.26గా, దిజేల్ ధర రూ 77.17 గా ఉండగా వాట్ తగ్గించడంతో 30 నుండి 26 శాతం మేరకు ధరలు తగ్గాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా `రాజస్తాన్ గౌరవ యాత్ర’ను జరుపుతున్న ముఖ్యమంత్రి వసుంధర రాజే రావత్సర్ లో జరిగిన బహిరంగ సభలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

ఈ నిర్ణయం తీసుకోవడం వల్లన రాష్ట్ర ప్రభుత్వం రూ 2,000  కోట్ల మేరకు ఆదాయం కోల్పోవలసి ఉంటుంది. అయినా సారీ, ప్రజల ఇబండులను దృష్టిలో ఉంచుకొనే వాట్ 4 శాతం మేరకు తగ్గించాలని నిర్ణయించామని ఆమె ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రజలు = రైతులు, మహిళలు, మరెవరైనా వారికి అవసరమైన ఉపసమనం కలిగించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడు ముందంజలో ఉంటుందని ఆమె స్పష్టం చేసారు.