యునెస్కో వారసత్వ జాబితాలో జైపూర్

పింక్ సిటీగా గుర్తింపు తెచ్చుకున్న రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ అరుదైన యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడుతున్న జైపూర్ నగరాన్ని ప్రపంచంలోని వారసత్వ జాబితాలో చేర్చినట్లు యునెస్కో శనివారం ట్వీట్ చేసింది.

జైపూర్ నగరానికి యునెస్కో గుర్తింపు లభించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. జైపూర్ నగరం అందాలతో, సంస్కృతి, సంప్రదాయాలతో అలరారుతుంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రజల వీరత్వం, పోరాట పటిమ కనబడతాయని ఆయన తెలిపారు. అటువంటి నగరానికి యునె స్కో జాబితాలో స్థానం లభించడంతో సంతోషాన్ని కలిగిస్తున్నదని ఆయన ట్వీట్ చేశారు.

ఇలాఉండగా బాకు (అజర్‌బైజన్)లో జూన్ 30న ప్రారంభమైన యునెస్కో 43వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశాలు 10వ తేదీన ముగియనున్నా యి. ప్రపంచ వారసత్వ నగరాలు, కట్టడాల గురిం చి ఈ కమిటీ చర్చించి యునెస్కో జాబితాలో చేరుస్తుంది. ఇందులో భాగంగానే రాజస్థాన్ రాజధాని జైపూర్‌ను ఎంపిక చేసింది.

ప్రపంచంలోని చారిత్రక, వారసత్వ కట్టడాల, స్థలాల పరిశీలన కౌన్సిల్ (ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెం ట్స్ అండ్ సైట్స్-ఇకోమాస్) 2018లోనే జైపూర్ నగరాన్ని సందర్శించి యునెస్కో జాబితాలో చేర్చాలంటూ సిఫార్సు చేసినట్లు ఇకోమాస్ సీనియర్ అధికారి తెలిపారు. దీంతో ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ పరిశీలన చేసి ఎంపిక చేయ డం జరిగిందని పేర్కొన్నారు. 1727వ శతాబ్దంలో సావాయి జై సింగ్-2 సారథ్యంలో రాజస్థాన్ వెలిసింది. ఆ రాష్ట్ర రాజధానిగా జైపూర్ విరాజిల్లుతోంది.