రైల్వేలలో 1.3 లక్షల ఉద్యోగాల భర్తీకి భారీ పక్రియ

భారత రైల్వేల చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత భారీగా ఒకేసారి 1.3 లక్షల ఉద్యోగాల భర్తీకి రైల్వే మంత్రిత్వ శాఖ భారీ కసరత్తు ప్రారంభించింది. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఒకేసారి ఇంతమంది ఉద్యోగ నీయమకాలు జరగక పోవడం గమనార్హం. అభ్యర్ధుల ఎంపిక కోసం 166 పట్టణాలలోని 439 పరిక్షా కేంద్రాలలో పరిక్షలు జరుగుతున్నాయి. ఆగష్టు 9న ప్రారంభమైన ఈ పరిక్షలు పది రోజుల పాటు రోజుకు మూడు షిఫ్ట్ లలో జరుగుతున్నాయి.

మొదటి రోజున రైల్వే బోర్డు చరిమన్ అశ్వని లోహని ఢిల్లీ పరిసర ప్రాంతాలలోని పరీక్షా కేంద్రాల వద్దకు వెళ్లి పరిక్షలు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. ఈ మొత్తం పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించేందుకు ఢిల్లీలో ఒక కమాండ్ కేంద్రం ఏర్పాటు చేసారు. ప్రస్తుతం సహాయ లోకో పైలట్ లు, గతంలో గ్రూప్ డి గా పేర్కొన లెవెల్ – 1 ఉద్యోగాల భర్తీ పక్రియ నడుస్తున్నది. లోకో పైలట్, సాంకేతిక పనివారాల పోస్ట్ లు మొత్తం 60 వేల వరకు ఉండగా, లెవెల్ – 1 ఉద్యోగాలు మరో 63 వేలు ఉన్నాయి. మొత్తం సుమారు 2.4 కోట్ల మంది అభ్యర్ధులు ఈ పరిక్షల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.

సహాయ లోకో పైలట్ ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారంగా టెస్ట్ నిర్వహిస్తున్నారు. మొత్తం 15 భాషలలో ఈ పరిక్షలు జరుపుతున్నారు. మొదటి రోజుననే దరఖాస్తు చేసిన వారిలో 74 శాతం మందికి పైగా ఎక్కువమంది హాజరయ్యారు. అభ్యర్ధులలో 83 శాతం మందికి వారి స్వస్తలంకు 500 కిమీ లోపలనే పరిక్షా కేంద్రం ఏర్పాటు చేసారు. మహిళా అభ్యర్ధులు, వికలాంగులకు 20౦ కిమీ లోపలనే పరీక్షా కేంద్రం ఉండే విధంగా ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు.

పలు ప్రాంతాల నుండి అభ్యర్ధుల కోసం ప్రత్యేక రైళ్ళను కుడా ఏర్పాటు చేసారు. ఇప్పటి వరకు 10 జతల ప్రత్యేక రైళ్ళు ఏర్పాటు చేసారు. అవసరాన్ని బట్టి మరిన్ని ఏర్పాటు చేయడం కోసం సిద్దపడుతున్నారు.