బిజెపి టచ్ లో 18 మంది టీడీపీ ఎమ్యెల్యేలు: సునీల్ దేవధర్

ఎన్నికలలో ఘోర పరాజయం ఎదురైన టీడీపీ రాజకీయ అస్తిత్వం ప్రశ్నార్ధకరంగా మారనున్నదా? రాజకీయ భవిష్యత్ కోసం ఆ పార్టీ నేతలు బిజెపి వైపు చూస్తున్నారా ? 2024 నాటికి రాష్ట్రంలో  బలీయమైన శక్తిగా ఎదిగి అధికారంకోసం గట్టిగా పోటీ పడాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బిజెపి నాయకత్వం టిడిపిలో నెలకొన్న ఈ పరిస్థితులను అవకాశంగా మానుకోవాలని చూస్తున్నదా ? 

బీజేపీ ఆంధ్రప్రదేశ్ కో-ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ నుంచి గెలిచిన 23మంది ఎమ్మెల్యేల్లో 18మంది తమతో టచ్‌లో ఉన్నారని దియోధర్ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. 

చంద్రబాబుతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ కారణంగానే టీడీపీ ప్రతిష్ట దిగజారిందని తెలుసుకున్న ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు చేసిన తప్పుల వల్ల, అవినీతి వల్ల ఏపీలో టీడీపీకి భవిష్యత్ లేకుండా పోయిందని దియోధర్ చెప్పుకొచ్చారు. 

ఇక ఏపీలో బలం పుంజుకునేందుకు బీజేపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని.. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో లక్ష మందిని పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్లనున్నట్లు దియోధర్ తెలిపారు.