ప్రజాస్వామ్యమంటే ఆషామాషీ కాదు

ప్రజాస్వామ్యమంటే ఆషామాషీకాదని, ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. మరోవైపు నీటి సంరక్షణకు త్రిసూత్ర పథకాన్ని ప్రతిపాదించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మలి విడుత ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ ఆదివారం తొలిసారి మన్‌కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు.

ఎవరైనా మీ హక్కులను లాగేసుకుంటే తప్ప, ప్రజాస్వామ్య సుగంధం విలువ మీకు అర్థం కాదు. తినడానికి భోజనం లభించిన వాడికి ఆకలి బాధలు తెలియవు అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో పౌరులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఆయన గుర్తుచేశారు.

ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో చివరి విడుత పోలింగ్‌కు ముందు కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడాన్ని ప్రస్తావిస్తూ ఇది రాజకీయ యాత్ర కాదని, తన అంతరంగ ఆవిష్కరణకు తాను కల్పించుకున్న ఒక అవకాశం అని చెప్పారు. కేదార్‌నాథ్ యాత్రపై చాలా మంది రాజకీయ అర్థాలు వెతికారని ఆరోపించారు.

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు ఫిబ్రవరిలో జరిగిన చివరి మన్‌కీ బాత్‌లోనూ తాను తిరిగి అధికారం చేపట్టనున్నానని చేసిన వ్యాఖ్యపై అది అతి విశ్వాసం అని విమర్శించారన్నారు. కానీ మీ విశ్వాసమే నాకు తిరిగి అధికారం అప్పగించింది అని ప్రజలనుద్దేశించి చెప్పారు. ఇటీవలి ఎన్నికల్లో 91 కోట్ల మంది ఓటర్లకు 61 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ఈ దఫా తొలితరం ఓటర్లు, మహిళలు ఎంతో ఆసక్తిగా ఓటేశారు. దీనికి తోడు పార్లమెంట్‌కు 78 మంది మహిళలు ఎన్నిక కావడం ప్రోత్సాహకరం అని తెలిపారు. 

స్వచ్ఛతా ఉద్యమం మాదిరిగా నీటి సంరక్షణ కోసం దేశవ్యాప్తంగా నీటి పొదుపు ఉద్యమం చేపట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇందుకోసం త్రిసూత్ర పథకం ప్రతిపాదించారు. ఉమ్మడిగా సృజనాత్మక చర్యల