రాజీవ్ గాంధీ హంతకులను విడిచి పెట్టాలి

మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హంతకులను జైలు నుంచి విముక్తి చేయాలని తమిళనాడు మంత్రివర్గం సిఫారసు చేసింది. మాట్లాడుతూ రాజీవ్ హత్య కేసులో ప్రస్తుతం ఏడుగురు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరిని విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి పళని స్వామి నేతృత్వంలోని మంత్రివర్గం సిఫారసు చేసినట్లు మంత్రి జయకుమార్ తెలిపారు. మంత్రివర్గ సిఫారసును గవర్నర్‌కు పంపిస్తామని పేర్కొనారు.

మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూరులో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన ఎన్నికల ప్రచారం కోసం అక్కడికి వెళ్ళారు. థాను అనే మహిళా ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకోవడంతో ఆయన మరణించారు.

పెరారివలన్, వీ శ్రీహరన్ వురపు మురుగన్, టీ సుదేంద్ర రాజా, జయ కుమార్, రాబర్ట్ పయస్, పీ రవిచంద్రన్, నళిని ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరు 27 ఏళ్ళుగా జిల్లాలో ఉన్నారు. వీరిని విడుదల చేయాలనీ కోరుతూ నాలుగేళ్ల క్రితం ముఖ్యమంత్రి జయలలిత ప్రతిపాదించిన తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం పలు సార్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసింది.

కాగా, నళిని పిటీషన్ పై స్పందిస్తూ చట్ట ప్రకారం గవర్నర్ కు వీరిని విడుదల చేసే అధికారం ఉన్నదని సుప్రేం కోర్ట్ గత గురువారం పేర్కొనడంతో వారిని విడుదల చేయాలనీ డిఎంకె తో సహా రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేసాయి.