రైతుబంధు పథకం నిరంతర పక్రియ

రైతుబంధు పథకం నిరంతరం కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరితో కలసి జనగామ మండలం పెంబర్తి గ్రామంలో "రైతుబంధు జీవిత బీమా" దృవీకరణ పత్రాలను రైతులకు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ అర్హులైన, కొత్తగా భూమి మార్పులు జరిగి పాస్ పుస్తకాలను పొందిన రైతులకు ఈ పథకం వర్తింపచేస్తామని చెప్పారు. ఇప్పటికే వెరే రకాలైన బీమా ఉన్న రైతులు కూడా ఈ పథకానికి అర్హులు, అశ్రద్ద చేయకుండా రైతు బీమా పథకంలో పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించారు.

రైతులు ఆత్మగౌరవంతో బతకాలి, అప్పుల ఊభి నుండి బయటపడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేసారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు, అయినా ముఖ్యమంత్రి గారు లోతుగా ఆలోచన చేసి ప్రజలకు మేలు చెసే పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ. 4000 చొప్పున ఇస్తున్నారని అంటూ ఈ ఏడాది వానాకాలంలో ఇప్పటి వరకు రూ. 5670 కోట్లు ఇచ్చామని తెలిపారు.  వచ్చే యాసంగి కోసం నవంబర్ 18 నుంచి చెక్కులను పంపిణీ చేస్తామని ప్రకటించారు. దీనికోసం ప్రభుత్వం నిధుల విడుదలకు అనుమతించిందని చెబుతూ రాష్ట్రంలో 91 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని చెప్పారు. మొత్తం 58 లక్షల మంది రైతులలో 51 లక్షల మంది చిన్న రైతులే ఉన్నారని పేర్కొన్నారు.