ఓటమిని ఒప్పుకోలేక ఈవీఎంలపై నెపమా?

దేశంలో ఎన్నికల సంస్కరణలు కొనసాగాల్సిందేనని ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. అయితే ప్రతిపక్షం అర్థంలేని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా  ప్రధాని మోదీ బుధవారం రాజ్యసభలో మాట్లాడారు. 

ఈవీఎంలపై ఆరోపణలు సాధారణమైపోయాయని, తమ తప్పిదాలకు కొందరు నేతలు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కొందరు వ్యక్తులు ఈవీఎంల సమస్యను సభలో లేవనెత్తారన్నారు. తమ పార్టీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే పార్లమెంట్‌లో ఉన్న సమయంలో తామెంతగానో కష్టపడి పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. తద్వారా ప్రజా విశ్వాసాన్ని చూరగొన్నామని తెలిపారు. 

అంతేగానీ, పోలింగ్‌ బూత్‌లను తాము ఏనాడూ విమర్శించలేదని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఓటమిని కాంగ్రెస్‌ అంగీకరించలేకపోతోందని విమర్శించారు. ఇలాంటి వైఖరి ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకర సంకేతం కాదన్నీ స్పష్టం చేశారు. ఒకే దేశం.. ఒకే ఎన్నిక దేశానికి ఎంతో అవసరమని చెబుతూ ఈవీఎంలతో దేశంలో ఇప్పటి వరకు 4 సాధారణ, పలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.  

ఎన్నికల కమీషన్ ఈవీఎంల అంశంపై సమావేశం ఏర్పాటు చేస్తే కేవలం రెండు పార్టీలు - ఎన్సీపీ, సిపిఐ మాత్రమే హాజరయ్యాయని అంటూ వారిని అభినందించారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పార్టీలు ఎందుకు హాజరు కాలేదో సమాధానం చెప్పాలని కోరారు. 

 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బిజెపి గెలిచినా దేశం ఓడిపోయిందని వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నేతలపై మోదీ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే పెద్ద అవమానమని అభివర్ణించారు. కాంగ్రెస్‌ చెడు ఆలోచనలతో ప్రజా తీర్పునే అవమానిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో భారత్‌ ఓడిపోతే.. మ