విద్యుత్‌ కొనుగోళ్లలో రూ 2336 కోట్ల రికవరీ

టీడీపీ ప్రభుత్వ హాయంలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. 30 అంశాలపై విచారణ చేయిస్తామని.. సీసీబీ, సీఐడీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థల సహకారం తీసుకుంటామని వెల్లడించారు. విద్యుత్‌రంగ సమీక్షా సమావేశంలో ఈమేరకు ప్రకటన చేశారు.  

గత ప్రభు  త్వ హయాంలో విద్యుత్‌ ఒప్పందాలు చేసిన ఉన్నతాధికారి, అప్పటి మంత్రి, సీఎంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని..  ఈ అంశంపై కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు.  ప్రభుత్వ ఖజానాకు రూ.2636 కోట్లు నష్టం వాటిల్లిందని, ఈ డబ్బును రికవరీ చేయాలని సీఎం ఆదేశించారు. 

కరెంటు కొనుగోళ్లలో అక్రమాలపై దృష్టి పెట్టిన సీఎం జగన్‌.. సోలావర్, విండ్‌ పవర్‌ కొనుగోళ్లపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ రేట్లకన్నా అధిక రేట్లకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. 

కంపెనీలతో తిరిగి సంప్రదింపులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సోలార్, విండ్‌ కంపెనీలు దారికి రాకుంటే వారితో ఒప్పందాలు రద్దుచేయాలని సూచించారు. సోలార్, విండ్‌ కంపెనీలతో జరిగిన ఒప్పందాల్లో భారీ దోపిడీ జరిగినట్టు స్పష్టమైందన్నారు. ఈ వ్యవహారంలో ఎంతటివారున్నా వదిలిపెట్టొద్దని.. ఉన్నతాధికారులు, మంత్రి, ముఖ్యమంత్రి ఉన్నా సరే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.