అమిత్‌షా కోసం ఎదురు చూస్తున్న తెలంగాణా బిజెపి

ముందస్తు ఎన్నికల కోసం అభ్యర్ధుల ఎంపిక నుండి ప్రచార వ్యుహలకు పదును పెట్టడంలో తెలంగాణ బిజెపి పార్టీ అద్యక్షుడు అమిత్ షా రాక కోసం ఎదురు చూస్తున్నది. ఈ నెల 15న మహబూబ్‌నగర్ జిల్లాలో ఆయన పార్టీ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర శాఖకు నిర్దుష్టమైన మార్గదర్శనం చేయగలరని భావిస్తున్నారు.

తెలంగాణలో ఊహించని విధంగా వచ్చిన ఎన్నికలను ఎదుర్కొనేందుకు బిజెపి అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రారంభ ప్రసంగంలోనే అమిత్ షా ప్రకటించారు. కొద్ది రోజుల ముందు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర పార్టీ కోర్ కమిటీతో సమావేశమైన అమిత్ షా అన్ని సీట్లకు పోటీ చేయడానికి సిద్దం కమ్మనమని ఆదేశించారు. ఈ విషయమై గత కొన్ని నెలలుగా కసరత్తు చేస్తున్నారు.

ఎన్నికల ప్రకటన జరిగిన తర్వాత ఎన్నికలు జరుగుతున్న మిగిలిన రాష్త్రాలలో ప్రచార బాధ్యతలను ఆయా ముఖ్యమంత్రులకు అప్పచెప్పి తాను తెలంగాణపై ద్రుష్టి సారిస్తానని కుడా ఆయన హామీ ఇచ్చారు. రాస్త్రంలో పది ఎన్నికల ప్రచార సభలలో పాల్గొననున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు సహితం పార్టీ ప్రచార సభలలో పాల్గొనే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

మొదటి విడతగా 50 సభలను ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా తెలంగాణ విమోచన దినం రోజున భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ సమాలోచనలు చేస్తున్నట్టు రాష్ట్ర పార్టీ అద్యక్షుడు డా. కె. లక్ష్మణ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా లతో పటు పలువురు కేంద్ర మంత్రులు, బిజెపి ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ నాయకులు వీటిల్లో పాల్గొంటారు.

టిఆర్‌ఎస్ పార్టీ గత నాలుగేళ్ల వైఫల్యాలను ఈ సభల ద్వారా ఎండగడుతూ గెలుపు గుర్రాలను రంగంలోకి దించితీరుతామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. కేంద్రంలో అవినీతి రహిత, శీఘ్రగతిన పురోగతి సాధించే పాలనను అందించిన ప్రధాని మోదీ నాయకత్వాన్ని వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు.  టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తివాదులు బీజేపీ వైపు చూస్తున్నరని లక్ష్మణ్ చెప్పారు.