విమానాశ్రయాల్లో అందుబాటులో తాగునీరు, అల్పాహారం

దేశవ్యాప్తంగా ప్రభుత్వ నియంత్రణలో పని చేస్తున్న 90కి పైగా విమానాశ్రయాల్లో ప్రయాణికులకు ఎమ్మార్పీ రేటుకే తాగునీరు, అల్పాహారం అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తాగునీటి ప్యాకెట్లు, బాటిళ్ల కోసం, అల్పాహారం, టీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని గతనెలలోనే ఆయా విమానాశ్రయాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో టెండర్లను ఆహ్వానిస్తారు. అయితే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి విమానాశ్రయాలను ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్నందున ఈ ఆదేశాలు వర్తించవు.

వాటర్ బాటిళ్లు, శాండ్‌విచ్‌లతో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారని, టీ, కాఫీ రూ.10లకే విక్రయించాలని, సమోసా వంటి అల్పాహారం అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు ఒక అధికారి ఒకరు తెలిపారు. చెన్నై, కోల్‌కతా, లక్నో, పాట్నా, గువాహటి తదితక విమానాశ్రయాల్లో ఈ నిర్ణయం అమలులోకి రానున్నది.