పోలవరం పనులపై జగన్ అసంతృప్తి

పోలవరం ప్రాజెక్ట్‌ కాపర్‌ డ్యాం పనులపై  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  అసంతృప్తి వ్యక్తం చేశారు. పునరావాసం కల్పించకుండా కాపర్‌ డ్యాం నిర్మాణం ఎలా చేపట్టారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిలో వరదల కారణంగా నవంబర్‌ వరకు.. పోలవరం నిర్మాణం పనులు నిలుపుదల చేయాలని అధికారులు పేర్కొనగా కోట్లాది రూపాయలు వృధా చేశారని జగన్ అధికారులపై మండిపడ్డారు.  

తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పోలవరం పర్యటించి,  పోలవరం ప్రాంతంలో ఏరియల్‌ సర్వే చేశారు. కాపర్‌ డ్యామ్‌ నిర్మాణం, సాంకేతిక అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.  నీరు స్పిల్‌వేపైకి వచ్చి నిర్మాణాలకు అంతరాయం కలిగితే ఎలా అని నిలదీసేరు. గోదావరికి వరద వస్తే పనులు ఏవిధంగా సాగిస్తారని ప్రశ్నించారు.

నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంపై పరిశీలన జరపాలని  అధికారులను ఆదేశించారు. పోలవరం పనులపై నిపుణుల కమిటీతో ఆడిటింగ్‌ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను చూడటంతో పాటు ఏరియల్‌ సర్వే ద్వారా ఆ ప్రాంతాన్నంతా పరిశీలించారు. ఆ తర్వాత ప్రాజెక్టు సమీపంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 

వచ్చే నాలుగు నెలల్లో ఏయే పనులు చేయగలరంటూ అధికారులను ముఖ్యమంత్రి ప‍్రశ్నించగా, స్పిన్‌ ఛానెల్‌ ఏటిగట్లను పటిష్టపరుస్తామని తెలిపారు. ఇక డ్యామ్‌ పూర‍్తయిన పది నెలలలోపు హైడ్రాలిక్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని ఈ సమావేశంలో కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రికి తెలిపారు. 2021 ఫిబ్రవరి నాటికి ప్రధాన జలాశయాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు.