సిట్టింగ్ లకు సీట్లిచ్చి కెసిఆర్ పెద్ద సాహసం చేస్తున్నారా !

తెలంగాణలో అధికార పార్టీ శాసన సభ్యులపై క్షేత్ర స్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, వారితో ఎన్నికలకు వెళ్ళడం ఆత్మహత్య సదృశ్యమే అని టీఆర్ఎస్ నేతలే భావిస్తూ వస్తున్నారు. కొందరు మంత్రులతో సహా కనీసం 40 మందిని మార్చనిదే ఎన్నికలలో వ్యతిరేక పవనాలు తధ్యం అనే చెబుతూ వచ్చారు. ఆ మేరకు అధికార పక్షం నుండే మీడియాకు లీక్ లు కుడా వచ్చాయి.

నలుగురైడుగురుకి మినహా సిట్టింగ్ లు అందరికి సీట్లు ఇస్తానని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చెబుతూ వస్తుంటే ఆ పార్టీ వారే ఎవ్వరు నమ్మలేదు. ఇప్పుడే సీట్లు లేవంటే  ప్రతిపక్షాల వైపు వేడతారనే ఆ విధంగా చెబుతున్నట్లు భావించారు. అయితే కేవలం ఇద్దరికీ మాత్రమె సీట్లు లేవని చెప్పడం, మరో ఇదుగురికి మాత్రమె సీట్లు పెండింగ్ లో ఉంచి, మిగిలిన వారందరికీ సీట్లు ఇస్తున్నట్లు అసెంబ్లీ రద్దు రోజుననే ప్రకటించి ఒక విధంగా సంచలనం కలిగించారు.

ఈ విధంగా సిట్టింగ్ లందరికి దాదాపుగా సీట్లు ఇవ్వడం ద్వారా కెసిఆర్ రాజకీయంగా పెద్ద సాహసం చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు. ఒక విధంగా దుస్సాహమమే కాగలదని అనుకొంటున్నారు. ఎన్నికల ఫలితాలపై ఈ సహస ప్రయోగం ఎటువంటి ప్రభావం చూపిస్తుందో అని ఆసక్తి కలిగిస్తున్నది.

సీట్లు నిరాకరించిన ఇద్దరిలో ఒకరికి కొడుకు కేటి రామారావుకు సన్నిహితుడైన ఎంపి బల్క సుమన్ కు అసెంబ్లీకి పంపడం కోసమైతే, మరొకరికి మేనలుడు హరీష్ రావు కు సన్నిహితుడైన జర్నలిస్ట్ క్రాంతి కిరణ్ కు సీట్ ఇవ్వడం కోసమే సీట్లు ఇవ్వలేదని  చెబుతున్నారు. పెండింగ్ లో ఉంచిన సీట్లు కుడా ఇతరత్రా కారణాల వల్లనే గాని, సర్వే నివేదికలను బట్టి కాదని తెలుస్తున్నది. ఉదాహరణకు తన సీట్ ఖరారు చేయక పోవడానికి కేటిఆర్ కారణం అంటూ మాజీ మంత్రి కొండా సురేఖ బహిరంగంగానే ఆరోపించారు.

పలు వివాదాలలో ఇరుక్కున వారికి, నియోజక వర్గంలో వ్యతిరేకత పెంచుకున్న వారికి సహితం సీట్లు ఇచ్చారు. సిట్టింగ్ లను పెద్ద ఎత్తున మార్చితే పార్టీలో `తిరుగుబాటు’ వస్తుందని, ఒకే సీట్ కు అనేకమంది పోటీ పడుతూ ఉండడంతో ఎవ్వరిని ఎంపిక చేసినా మిగిలిన వారంతా ఇతర పార్టీల వైపు వెళ్లడమో, పార్టీ అభ్యర్హ్డులను ఓడించడమో చేస్తారనే భయంతోనే కెసిఆర్ సిట్టింగ్ లను మార్చడానికి వెనుకడుగు వేసిన్నట్లు తెలుస్తున్నది.

ఇప్పటికే సీట్ నిరాకరించిన కొండా సురేఖ, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ దిక్కర ధోరణి ప్రదర్శిస్తున్నారు. కెసిఆర్ బొమ్మ లేకుండా గెలుస్తామని సవాల్ చేస్తున్నారు. అంతే కాదు పార్టీలో మహిళలకు, బడుగు వర్గాలకు జరిగిన అన్యాయాలను ఏకరువు పెడుతున్నారు. అదే విధంగా పెద్ద ఎత్తున సిట్టింగ్ లను కాదంటే వారంతా తనపై తిరుగుబాటు చేసి ఎన్నికల సమయంలో ప్రజలలో గందరగోళం సృష్టిస్తారని భయపడిన్నట్లు పలువురు భావిస్తున్నారు.

కేవలం తనను చూసి ఓటు వేయాలని కోరటం ద్వారా ఎమ్మెల్యేలపై వ్యతిరేకతను అధిగమించాలనే ప్రయత్నం చేస్తునట్లు కనిపిస్తున్నది. సిట్టింగ్ లను కాదంటే వారు బజారున పది గత నాలుగేళ్ళ పాలనలో జరిగిన అక్రమాలు గురించి, కనీసం తమకు నోరెత్తకుండా చేసారని, సిఎం కెసిఆర్ కాకపోయినా ఆయన కుమారుడు కేటిఆర్ కుడా అందుబాటులో ఉండేవారు కాదని అంశాలను ప్రస్తావిస్తే అసలుకే మోసం వస్తుందని కెసిఆర్ సందేహించిన్నట్లు చెబుతున్నారు. కెసిఆర్ తయయుడు కేటిఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావు సాగించిన `రాచకార్యాలు’ గురించి కుడా ఏకరువు పెడతారని అంచనా వేసిన్నట్లు భావిస్తున్నారు.

సీట్ రాక పోవడంతో ఆ విధంగా మాట్లాడుతున్నారని వారి మాటలను కొట్టివేసే అవకాశం ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెప్పే మాటలకు ప్రజలలో కొంత విలువ ఉంటుందని, వారి దృష్టిని ఆకట్టుకొందని నిర్ధారణకు వచ్చిన్నట్లు కనిపిస్తున్నది. దానితో ప్రతిపక్షాలకు బలమైన అస్త్రాలను అందించిన్నట్లు అవుతుందని వెనుకడుగు వేసారు.  ప్రజల్లో ఇప్పటికే వ్యాపించిన అభిప్రాయాలను వారు బహిరంగంగా చెపితే అవి మరింత ఈజీగా కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుందని కుడా భావించిన్నట్లు తెలుస్తున్నది.