బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత

కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో జన జాగృతి పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా కనిపిస్తోందని భరోసా వ్యక్తం చేశారు. తాను స్థాపించిన జన జాగృతి పార్టీని త్వరలో బీజేపీలో విలీనం చేస్తానని ప్రకటించారు. విభజన హామీల సాధనకు తన వంతు కృషి చేస్తానని కొత్తపల్లి గీత చెప్పారు. 

కాగా కొత్తపల్లి గీత 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అరకు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వైసీపీకి దూరం ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఆ పార్టీకి కూడా దూరం పాటిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె జన జాగృతి పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే.అమిత్‌షా ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.