రాజ్యసభ నేతగా తావర్ చంద్ గెహ్లాట్

రాజ్యసభ నేతగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ నియమితులయ్యారు. ఇంతకుముందు వరకు బీజేపీ సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ ఈ బాధ్యతలు నిర్వర్తించారు. అనారోగ్య కారణాలతో ఆయన ప్రభుత్వ వ్యవహారాలకు దూరంగా ఉండటంతో, సీనియర్‌ పార్లమెంటేరియన్‌, బీజేపీ దళిత నేత తావర్‌చంద్‌కు అవకాశం కల్పించారు.

ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో పార్టీ నేతగా వ్యవహరిస్తారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభ డిప్యూటీ లీడర్‌గా నియమితులయ్యారు. ఇక రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా రైల్వేలు, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రి పీయూష్ గోయల్ నియమితులయ్యారు. ఆయన కేంద్ర మంత్రి కాకమునుపు బీజేపీ జాతీయ కోశాధికారిగా వ్యవహరించారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.

ప్రభుత్వ చీఫ్ విప్ గా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్ గా అర్జున్ రామ్ మేఘవాల్ (లోక్ సభ), వి మురళీధరన్ (రాజ్యసభ) నియమితులయ్యారు. పార్టీ చీఫ్ విప్ లుగా సంజయ్ జైస్వాల్ (లోక్ సభ), నారాయణ్ లాల్ పంచరియా (రాజ్య సభ), పార్లమెంటరీ పార్టీ కార్యదర్శులుగా గణేష్ సింగ్, (లోక్ సభ), భూపేంద్ర యాదవ్ (రాజ్య సభ), కోశాధికారిగా గోపాల్ శెట్టిలను నియమించారు.

లోక్ సభ విప్ లుగా ప్రతిమా భూమిక్, సునీల్ సింగ్, పర్వేశ్ వర్మ, కిరీట్ భాయ్ సోలంకి, జోగల్ కిషోర్ శర్మ, నలిన్ కుమార్ కటీల్. సుధీర్ గుప్త, సంతోష్ పాండే, కపిల్ మోరేశ్వర్ పటేల్, సురేష్ పూజారి, కనక్ మాల్ కటారియా, అజయ్ మిశ్ర, భాను ప్రతాప్ సింగ్ వర్మ,  పాంకజ్ చౌదరి, ఖగేన్ మురు, రంజనభేన్ భట్, శోభా కారణ్డలజే, లాకెట్ ఛటర్జీ; రాజ్యసభ విప్ లుగా అమర్ శంకర్ షేల్, షంషేర్ సింగ్ మన్హాస్, శ్వాప్ట్ మాలిక్, చున్నిభై, అజయ్ ప్రతాప్, అశోక్ బాజ్పాయి లను నియమించారు.

ప్రత్యేక ఆహ్వానితులుగా నితిన్ గడ్కరీ, రవి శంకర్ ప్రసాద్, అర్జున్ ముండా, నరేంద్ర సింగ్ తోమర్, స్మ్రితి ఇరానీ, జుల్ ఓరమ్ (లోక్ సభ), జె పి నంద, ఓం ప్రకాష్ మాథుర్, నిర్మల  సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాష్ జవదేకర్ (రాజ్యసభ) నియమితులయ్యారు.