ముఖ్యమంత్రి పదవిపై అక్బరుద్దీన్ కన్ను !

రద్దయిన శాసన సభలో కేవలం ఏడుగురు సభ్యులు మాత్రమె ఉన్న ఎంఐఎం ఏంఐఏం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కన్ని ముఖ్యమంత్రి పీఠంపై పడిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. శుక్రవారం మల్లేపల్లిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు అందుకు పూర్తి ఆస్కారం కలిగిస్తున్నాయి.

అసెంబ్లీ రద్దు సందర్భంగా ఎంఐఎం తమ మిత్రపక్షమని, ఎన్నికలలో `స్నేహపూర్వక’ పోటీ మాత్రమె ఉంటుందని అనడమే కాకుండా ఒవైసీ సోదరులను తన శ్రేయోభిలాషులుగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొనడం గమనార్హం. అయితే అక్బరుద్దీన్ మాటలను చూస్తుంటే తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉన్నట్లు కనబడటం లేదు. ఆ పార్టీ మద్దతుతో తమ సీట్లను పెంచుకొనే, హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తామే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనీ పధకాలు వేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.

నవంబర్ లో ముందస్తు ఎన్నికలు జరిగుతాయని, డిసెంబర్ లో తిరిగి తాను ముఖ్యమంత్రిని అవబోతున్నానని కెసిఆర్ చెప్పడాన్ని గుర్తు చేసారు. నవంబర్ లో ఎన్నికలు జరగడం నిజయే అయినా, డిసెంబర్ లో ఏమి జరుగుతుందే ఎవ్వరి అవసరం ఎవ్వరికీ వస్తుందో అంటూ నర్మగర్భంగా పేర్కొన్నారు. డిసెంబర్ లో `మనమే’ ముఖ్యమంత్రిమి అవబోతున్నామని అంటూ అక్బరుద్దీన్ పార్టీ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి కాగాలిగినప్పుడు తెలంగాణలో మజ్లిస్ నుండి ఒకరు ఎందుకు ముఖ్యమంత్రి కాగూడదని ఆయన ప్రశ్నించడం టీఆర్ఎస్ వర్గాలలో కలవరం కలిగిస్తున్నది. ఒకవంక తమతో మిత్రత్వం జరుపుతూనే తెరవెనుక ఏదో పధకం రచిస్తున్నరనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ వరకు వేచి చూద్దామని, ఎవ్వరి అవసరాలు ఎవ్వరికీ వస్తాయో తెలిపోతుమని అంటూ ధీమాగా పేర్కొన్నారు.

అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటన చూస్తే కెసిఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం అసంభవమని న్రిధరణకు వచ్చిన్నట్లే ఉన్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తాము రెండంకెల సభ్యులను గెలిపించుకో గలిగితే ఒక వైపు టీఆర్ఎస్, మరో వైపు కాంగ్రెస్ పోటీ పడి ముఖ్యమంత్రిగా తనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉండవచ్చని అక్బరుద్దీన్ ధీమాలో ఉన్నట్లు భావించ వలసి వస్తున్నది.