ప్రొటెమ్‌ స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌

మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎం వీరేంద్ర కుమార్‌ ప్రొటెమ్‌ స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. ఎంపీలోని తికమ్‌ఘర్‌ నుంచి ఈయన ఏడుసార్లు ఎంపీగా ఎంపికయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ వీరేంద్ర కుమార్‌ పేరును ఖరారు చేసిందని, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. వీరేంద్రకుమార్‌ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. 

నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఆయన మహిళ, శిశుసంరక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అలాగే మైనారిటీ శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. 1996 నుండి లోక్ సభకు ఎన్నికవుతూ వస్తున్నారు. వీరేంద్ర కుమార్‌ దళిత కులానికి చెందిన నాయకుడు. ఏబీవీపీ కార్యకర్తగా వీరేంద్ర రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1977-79 మధ్య కాలంలో ఏబీవీపీ కన్వినర్‌గా పని చేశారు. 

1975లో జేపీ మూవ్‌మెంట్‌లో చురుగ్గా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, చైల్డ్‌ లేబర్‌ అంశంపై పీహెచ్‌డీ చేశారు.