ఇక ప్యాకెట్ల రూపంలో ఇంటివద్దకే రేషన్‌

ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాలశాఖ సెప్టెంబర్‌ నుండి రేషన్‌ సరుకులన్నింటినీ ప్యాకెట్ల రూపం లోనే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి క్యాబినెట్‌లో చర్చించారు. రేషన్‌ బియ్యం ఇతర సరుకులు పక్కదారి పట్టడాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రేషన్‌ బియ్యాన్ని 50 కేజీల బస్తాల్లో రేషన్‌ షాపులకు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అయితే దీని వల్ల బియ్యం అధిక మొత్తంలో పక్క దారి పట్టడం, విజిలెన్స్‌ దాడుల్లో బియ్యం అక్రమ తరలింపులను అడ్డుకోవడం వంటి సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. 

అక్రమాలను అరికట్టేందుకు కొత్త ప్రభుత్వం ఇలాంటి పద్ధతు లను అవలంభించనుంది. రేషన్‌షాపు డీలర్లకు రేషన్‌ సరుకులను తూకం వేసే పనిని కూడా ఈ విధానంతో ప్రభుత్వం తగ్గించనుంది. రేషన్‌ సరుకులు అన్నింటినీ ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేసేందుకు కావాల్సిన వివరాలను పౌరసరఫరాల శాఖ నుండి సేకరించిన తరువాత సిఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రేషన్‌ బియ్యాన్ని 5, 10, 20 కేజీల ప్యాకెట్లుగా తయారు చేసి పౌరసరఫరాలశాఖ పంపిణీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.47 కోట్ల రేషన్‌ కార్డులున్నాయి. వీటిలో అంత్యోదయ అన్న యోజన(ఎఎవై) కార్డులు 10 లక్షలు, లబ్ధిదారులు ఒక్కరే ఉన్న రేషన్‌ కార్డులు 23 లక్షలు, ఇద్దరు లబ్ధిదారులు ఉన్న కార్డులు 35 లక్షలు, ముగ్గురు ఉన్న కార్డులు 29 లక్షలు, నలుగురు ఉన్న కార్డులు 38 లక్షలు, ఐదుగురు అంతకన్నా ఎక్కువ ఉన్న కార్డులు 12 లక్షలు ఉన్నాయి. 

బియ్యం ప్యాకెట్లను సభ్యుల సంఖ్యను ఆధారంగా చేసుకుని ఒక్కరు ఉన్న వారికి 5 కేజీల ప్యాకెట్టు, ఇద్దరు ఉన్న కార్డులకు 10కేజీల ప్యాకెట్టు, ముగ్గురు ఉంటే 10, 5 కేజీల ప్యాకెట్లు, నలుగురు ఉంటే 20కేజీల ప్యాకెట్టు పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా ఇతర సరుకులన్నింటినీ ప్యాకెట్ల రూపంలోనే యంత్రాల ద్వారా తూకం వేసి, ప్యాకింగ్‌ చేసి ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేయనుంది.

బియ్యం ప్యాకెట్ల తయారీకి ప్రభుత్వం అధునాతన యంత్రాలను కొనుగోలు చేయనుంది. ఈ యంత్రాలే బియ్యాన్ని 5, 10, 20 కేజీల ప్యాకెట్లకు తూకం వేసి ప్యాకింగ్‌ చేయనున్నాయి. మొత్తం రూ.19.29 లక్షలతో ఒక పాయింట్‌ లో యంత్రాలను నెలకొల్పనుంది. యంత్రాలను నెలకొల్పడానికి, యంత్రాల రవాణా ఖర్చులన్నిం టితో కలిపి