సుచరిత-హోం, బుగ్గన-ఆర్ధిక, బొత్స-మున్సిపల్

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సారథ్యంలోని  కొలువుతీరిన 25 మంది మంత్రులకు శాఖలను కేటాయించారు.  డిప్యూటీ ముఖ్యమంత్రులుగా పుష్పశ్రీవాణి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, ఆళ్ల నాని, నారాయణస్వామి, ఆంజాద్‌బాషాలను నియమించారు. సుచరితకు హోమ్, పిల్లికి రెవిన్యూ, ఆళ్ళ నానికి వైద్య,ఆరోగ్య, నారాయణస్వామికి ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులు, ఆంజాద్‌ బాషాకు మైనారిటీ వ్యవహారాలు కేటాయించారు. 

ఇక బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ఆర్థిక శాఖ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి  చాయతీరాజ్‌, బొత్స సత్యనారాయణకు  మున్సిపల్‌, పట్టణాభివృద్ధి, ధర్మాన కృష్ణ దాస్‌ కు రోడ్లు, భవనాలు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కు జలవనరుల శాఖ కేటాయించారు. మిగిలిన మంత్రులకు కేటాయించిన శాఖలు :

అవంతి శ్రీనివాస్‌-పర్యాటక శాఖ; మేకపాటి గౌతం రెడ్డి : పరిశ్రమలు, వాణిజ్యం; కన్నబాబు - వ్యవసాయ శాఖ; తానేటి వనిత -మహిళా, శిశు సంక్షేమం; కొడాలి నాని-పౌర సరఫరాల శాఖ; మోపిదేవి వెంకటరమణ-పశుసంవర్థక శాఖ; పినిపే విశ్వరూప్‌- సాంఘిక సంక్షేమం; పేర్ని నాని -రవాణా, సమాచార శాఖ; ఆదిమూలపు సురేశ్‌- విద్యాశాఖ; బాలినేని శ్రీనివాస్‌ - అటవీ, పర్యావరణం; గుమ్మనూరు జయరాం-కార్మిక, ఉపాధి శాఖ;  శంకర్‌ నారాయణ-బీసీ సంక్షేమం; వెల్లంపల్లి శ్రీనివాసరావు-దేవాదాయ శాఖ.