లైంగిక వేధింపులు సహజమే : కమీషన్ చైర్ పర్సన్

పెరుగుతున్న లైంగిక వేధింపుల గురించి సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతూ ఉంటె, వాటిని అరికట్టడం కోసం క్రియాశీలకంగా వ్యవహరించా వలసిన కేరళా మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ ఎంసీ జోసెఫిన్‌ మాత్రం అటువంటివి సహజమే అన్నట్లు మాట్లాడటం విస్మయం కలిగిస్తుంది. పైగా, అధికారంలో ఉన్న సిపిఎం ఎమ్మెల్యేపై వచ్చిన లైంగిక ఆరోపణలను పరోక్షంగా సమర్ధిస్తున్నట్లు మాట్లాడారు.

మానవులు తప్పులు చేయడం సహజమేనని, ఓ రాజకీయ పార్టీలో ఉన్న కూడా అలాంటి తప్పులు జరుగుతాయని వ్యాఖ్యానిస్తూ అదేదో సాధారణంగా జరిగే వ్యవహారంగా ఆమె చెప్పుకోవచ్చారు. షోర్నూర్‌ ఎమ్మెల్యే అయిన పీకే శశిపై ఓ సిపిఎం యువజన విభాగంకు చెందినా మహిళా నేత లైంగిక ఆరోపణలు చేశారు.  ఈ వ్యవహారంపై సిపిఎం ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నది. అయితే పోలీస్ లకు మాత్రం ఫిర్యాదు చేయలేదు.

ఈ అంశాన్ని మీడియాలో చుసిన వెంటనే స్పందిస్తూ ఈ కేసును నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర డీజీపీ, పోలీస్‌ ఉన్నతాధికారులకు బాధిత మహిళలకు సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఓ లేఖ ద్వారా సూచించింది.

కానీ, ఈ విషయంలో కేరళ మహిళా కమీషన్ స్పందించ వలసిన అవసరం లేదన్నట్లు జోసెఫిన్‌ చెప్పుకొచ్చారు. సదరు మహిళా ఈ విషయంలో కేరళ మహిళా కమిషన్‌ను ఆశ్రయించలేదని, సుమోటోగా కేసు నమోదు చేద్దామన్నా ఫిర్యాదుకు సబంధించిన విషయాలు మీడియాలో  రాలేదని అంటూ ఆమె అమాయకంగా తన నిస్సహాయతను వ్యక్తం చేసారు. అలాంటప్పుడు ఎలా కేసు నమోదు చేస్తామని ఎదురు ప్రశ్న వేసారు.  మార్క్సిస్ట్‌ పార్టీకి ఇలాంటి కేసులు విచారించడంలో సొంత ఎజెండా ఉంటుందంటూ చట్టబద్ద సంస్థలు ఆ `పార్టీ వ్యవహారాలలో’ జోక్యం చేసుకోరదన్నట్లు స్పష్తం చేసారు.

మరోవైపు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో మహిళా కమిషన్‌ ప్రేక్షక పాత్ర పోషిస్తుందని విమర్శించారు. సదరు బాధిత మహిళ ఈ మెయిల్‌ ద్వారా సిపిఎం పొటిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలకు ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టను నీరుగార్చేందుకు ఇలాంటి అసత్య ఆరోపణలతో కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే శశి పేర్కొన్నారు.