ఉత్తరాదిన తిరిగి బిజెపి... వసుంధరనే మార్చాలి !

లోక్ సభ ఎన్నికలకు ముందుగా ఈ సంవత్సరం చివరిలో ఎన్నికలు జరుగనున్న మూడు ఉత్తరాది రాష్త్రాలలో తిరిగి బిజెపి ప్రభంజనం స్పష్టం అవుతున్నది. అయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన శివరాజ్ సింగ్ చౌహాన్, రామన్ సింగ్ ఇంకా ఆయా రాష్త్రాలలో అత్యంత ప్రజాదరణ గల నేతలుగా కొనసాగుతుండగా, రాజస్తాన్ లో మాత్రం ప్రస్తుత ముఖ్యమంత్రి వసుంధర రాజే ను మార్చాలని కోరుకొంటున్నారు.

‘ఇండియా టుడే’ నిర్వహించిన పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సర్వేలో ఈ అంశాలు వెల్లడైనాయి. ఛత్తీస్‌గఢ్‌లో సర్వే లో పాల్గొన్న 41 శాతం మంది రమణ్ సింగ్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. ఆయన 2003 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ‘ఇండియా టుడే’ సర్వే నివేదిక ప్రకారం ఆయన నాలుగోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు భూపేశ్ బఘేల్‌ను తదుపరి సీఎంగా చూడాలనుకుంటున్నట్లు 21 శాతం మంది మాత్రమె  చెప్పారు.

రమణ్ సింగ్ ప్రభుత్వం పనితీరు పట్ల 39 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 34 శాతం మంది మార్పును కోరుకుంటున్నట్లు చెప్పారని ఈ సర్వే పేర్కొంది. టెలిఫోన్ ఇంటర్వ్యూల ద్వారా ఈ సర్వే నిర్వహించినట్లు ‘ఇండియా టుడే’ ప్రకటించింది. ఈ సర్వేలో 4,598 మంది తమ అభిప్రాయాలను తెలిపారని పేర్కొంది.

మధ్యప్రదేశ్ లో 46 శాతం మంది శివరాజ్ సింగ్ చౌహాన్ ను తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకొంటూ ఉండగా, కాంగ్రెస్ నేత జ్యోతిరాదియ సింధియాను 32 శాతం మంది కోరుకొంటున్నారు. అయితే ప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షుడిగా రాహుల్ గాంధీ నీయమించిన కమల్ నాద్ ను కేవలం 8 శాతం మంది మాత్రమె సియం కావాలని కోరుకొంటున్నారు.

ఇక రాజస్తాన్ లో 48 శాతం మంది ప్రజలు ప్రస్తుత ముఖ్యమంత్రి వసుంధర రాజే మారావలసిందే అని చెబుతున్నారు. 32 శాతం మంది మాత్రమె ఆమె పరిపాలన పట్ల సంత్రుతి వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నేతలలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ ఘేలోట్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని 35 శాతం మంది కోరుకొంటూ ఉండగా, ప్రదేశ్ కాంగ్రెస్ అద్యఖుడు సచిన్ పైలట్ ను 11 శాతం మంది మాత్రమె కోరుకొంటున్నారు.

ఈ మూడు రాష్త్రాలలో కుడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పట్ల ప్రజాదారణ స్థానిక ముఖ్యమంత్రుల కన్నా చాలా ఎక్కువగా ఉన్నది. రాహుల్ గాంధీ ప్రజాదరణలో బాగా వెనుకబడి ఉన్నారు. మధ్య ప్రదేశ్ లో 56 శాతం మంది మోడీని కోరుకొంతుండగా, 36 శాతం మంది మాత్రమె రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకొంటున్నారు.

ఇక, ఛత్తీస్‌గఢ్‌లో 59 శాతం మంది మోడీ తిరిగి ప్రధాని కావాలని కోరుకొంతుండగా, రాహుల్ ను 34 శాతం మంది మాత్రమె కోరుకొంటున్నారు. రాజస్తాన్ లో 57 మంది మోడిని ప్రధానిగా కోరుకొంతుండగా, రాహుల్ ను 35 శాతం మంది మాత్రమె కోరుకొంటున్నారు.