జగన్ హామీల అమలుకు రూ. 3.57 లక్షల కోట్లు

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలకు ఐదేళ్లలో రూ.3.57 లక్షల కోట్లు కావాల్సి ఉంటుందని, ఏటా రూ.75 వేల కోట్ల వరకు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు వారు ఒక నివేదిక శనివారం సమర్పిరచారు. వీటిని అమలు చేసేందుకు కావాల్సిన ఆర్ధిక వనరులు సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించినప్పటికీ ఇంత భారీ నిధులను ఎలా సమకూర్చాలన్న కోణంలో ఆర్ధికశాఖ మల్లగుల్లాలు పడుతోంది. మరోవంక ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనా వేస్తున్న ఆదాయాల్లో రమారమి రూ.26వేల కోట్ల వరకు కోత పడవచ్చని తాజాగా అధికారులు తెలిపారు.
 

మొత్తం 28 హామీలకు ఐదేళ్ల కాలంలో రూ.3,57,275 కోట్లు కావాల్సి ఉంటుంది. ఇది ఏడాదికి రూ.75,305 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. అయితే 2019-20 ఆర్ధిక సంవత్సరానికి రూ.49,943 కోట్లు కావాల్సి  ఉంటుందని వివరించారు. ఇప్పటికే రెరడు నెలలు పూర్తి కావడం, జూన్‌లో విధివిధానాలు రూపకల్పనకు చర్యలు తీసుకోవడంవల్ల ఇంకో తొమ్మిది నెలలకే నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఐదేళ్లకు చేసిన అంచనాల్లో వ్యక్తిగత పథకాలకు రూ.2.81 లక్షల కోట్లు, కమ్యూనిటీ అవసరాలకు రూ.5,895 కోట్లు, మద్యపాన నిషేధం వల్ల రూ.69,899 కోట్లు భరించాల్సి  అధికారులు పేర్కొన్నారు. పేదలకు కట్టించాల్సిన 25 లక్షల ఇళ్లకు ఏటా రూ.15వేల కోట్ల చొప్పున మొత్తం రూ.75 వేల కోట్లు అవసరం అవుతాయి.

అలాగే మూడు దశల్లో అమలు చేసే మద్యపాన నిషేధం  వల్ల ఏటా రూ.13,980 కోట్లు, ప్రస్తుతం భర్తీ చేసే 1,68,614 ఉద్యోగ ఖాళీలకు ఐదేళ్లలో రూ.59,232 కోట్లు, పెంచిన ఫించన్లకు రూ.37,203 కోట్లు, 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బిసి మహిళలకు ఆర్ధిక స్వావలంబన కింద  రూ.21 వేల కోట్లు, మహిళలకు రుణ మాఫీ కింద  రూ.19,247 కోట్లు, పట్టణ గృహ లబ్దిదారులకు రుణ మాఫీ కింద  రూ.18500 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.10వేల కోట్లు, షెడ్యూల్‌, బలహీన వర్గాల కౌలు రైతులకు ఆర్ధిక సాయం కింద  పది వేల కోట్లు కావాల్సి ఉంటుందని  ఆర్ధికశాఖ నివేదికలో వివరించారు.

చంద్రబాబు హయారలో అమలు చేసిన కొన్ని పథకాలను ఆపివేయడం వల్ల కొన్ని  నిధులు మిగులుతాయని, అయినా కొత్త పథకాలకు భారం తప్పదని వారు జగన్‌కు వివరించారు. అయితే ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కావాల్సిన నిధుల సమీకరణపై దృష్టి పెట్టాలని, ఇతర వృధా ఖర్చులను తగ్గిరచుకునే మార్గాలను అన్వేషిరచాలని ఆయన చెప్పారు.