పాక్ సరిహద్దుల్లో ఇక స్మార్ట్ ఫెన్సింగ్

పాక్ సరిహద్దుల్లో చొరబాటుదార్ల సమస్య తీవ్రంగా ఉంటుంది. ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రబుత్వం సంకల్పించింది. చీమను కూడా దూరనివ్వని టెక్నాలజీని ఉపయోగించాలని చూస్తున్నది. ఇందులో భాగంగా లేజర్ ఫెన్సులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టును హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ వారం ప్రారంభిస్తారని సరిహద్దు రక్షణ దళం డైరెక్టర్ జనరల్ కేకే శర్మ తెలిపారు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో గల సరిహద్దులపై ఈ అత్యాధునిక కంచె వ్యవస్థను ఏర్పాటు చేయానున్నట్టు ఆయన వివరించారు. దీనికి సమగ్ర సమీకృత సరిహద్దు నిర్వహణా వ్యవస్థ (సీఐబీఐఎంబస్) అని దీనికి పేరుపెట్టారు.

జమ్మూలో పైలట్ ప్రాజెక్టు పూర్తై పని చేస్తున్నదని, హోంమంత్రి సమయం ఇస్తే లాంఛనంగా ప్రారంభిస్తామని శర్మ తెలిపారు. అంతిమంగా ఈ స్మార్ట్ కంచెను మొత్తం 2400 కిలోమీటర్ల పొడవుకు విస్తరించాలనుకుంటున్నారు.