30న విజయవాడలో జగన్ ప్రమాణస్వీకారం

ఈ నెల 30న విజయవాడలో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలు తనపై  మరింత బాధ్యత ఉంచారని చెప్పారు. 

ఏపీ చరిత్రలోనే ఇదొక సంచలన విజయమని చెప్పారు. ఈ విజయం దేవుడి దయ వల్ల, ప్రజలందరి దీవెనలతో సాధ్యమైందని తెలిపారు. ఈ విజయం తన మీద ఉన్న బాధ్యతలను గుర్తిచేస్తోందని పేర్కొన్నారు. 

విశ్వసనీయతకు ఓటు వేశారని చెప్పారు. ప్రజలకు చెప్పేది ఒకటే.. 5 కోట్ల మందిలో ఒక్కరికీ ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారు. ఆ అవకాశం వచ్చినప్పుడు గవర్నెన్స్ ఎలా ఉంటుందో త్వరలోనే చూపిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.  

ఆరు నెలల నుండి ఒక సంవత్సరం లోపుగానే మంచి ముఖ్యమంత్రిగా ప్రజలతో అనిపించుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజలు విశ్వసనీయతకు వోట్  వేశారని చెబుతూ నవరత్నాలను అమలు జరపటమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. 

ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని ఆయన స్పష్టం చేస్తూ తన పాద యాత్ర సందర్భంగా ప్రజలు చెప్పిన సమస్యలు అన్ని గుర్తున్నాయని చెప్పారు.