వైఎస్ జగన్‌కు మోదీ శుభాకాంక్షలు

 

ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీపీ ప్రభంజనం సృష్టిస్తూ భారీ విజయం దిశగా దూసుకువెళ్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షులు, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు..‘ ప్రియమైన వైఎస్‌ జగన్‌.. ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన మీకు శుభాకాంక్షలు. మీ పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు ఇవే శుభాకాంక్షలు’ అని తెలుగులో ట్వీట్‌ చేశారు.