చంద్రబాబు సాయంత్రం రాజీనామా !

ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్, రాజకీయ విశ్లేషకుల అంచనాలను మించి అటు అసెంబ్లీతో పాటు లోక్‌సభ సీట్లను కైవసం చేసుకుంది. 

ఇప్పటికే వైసీపీ 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు టీడీపీ 24 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన సింగిల్ సీటులోనే ఆధిక్యంలో ఉంది. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉంది.

టీడీపీ ఘోర పరాజయం కావడంతో ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్‌కు ఫ్యాక్స్ ద్వారా రాజ్‌భవన్‌కు పంపించనున్నారు.