తెలంగాణలో నాలుగు సీట్లలో బిజెపి ముందంజ !

అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క సీట్ కె పరిమితం అయినా లోక్ సభ ఎన్నికలలో మాత్రం తెలంగాణలో ఐదు సీట్లలో బీజేపీ ముందంజలో ఉంది.  ముఖ్యంగా నిజామాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ కన్నా 18 వేల ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. 

నిజామాబాదు తో పాటు సికింద్రాబాద్, కరీంనగర్,  ఆదిలాబాద్,హైదరాబాద్ సీట్లలో కూడా బిజెపి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి 19వేల ఓట్ల ఆధిక్యంలో ఉండగా, ఆదిలాబాద్ లో బిజెపి అభ్యర్థి  సోయం బాబురావు 31,500 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. 

కరీంనగర్ లో బిజెపి అభ్యర్హ్ది బండి సంజయ్ 35,550 ఓట్ల ఆదికాయతలో ఉన్నారు.