ఏపీలో దూసుకు పోతున్న జగన్... 150 స్థానాల్లో ముందంజ

ఆంధ్ర  ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దూసుకు పోతున్నారు. మొత్తం 175  సీట్లు ఉండగా 150 సీట్లలో ఆధిక్యతలో ఉన్నారు. ప్రస్తుతం అధికారమలో ఉన్న తెలుగు దేశం 24 సీట్లకు పరిమితం కావలసి వస్తున్నది. దాదాపు అన్ని జిల్లాల్లో జగన్ ప్రభంజనం కనిపిస్తున్నది. 

మంత్రులుగా పనిచేసిన నారా లోకేశ్‌, అఖిలప్రియ, నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అయ్యన్నపాత్రుడు, చిన రాజప్ప, అమర్‌నాథ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర వెనుకంజలో ఉన్నారు. 

అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ వైసిపి  అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను బట్టి 21 ఎంపీ స్థానాల్లో వైసిపి  అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు. టిడిపి  4 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది.