కొంగర కలాన్ తో కేటిఆర్ అవుట్... హరీష్ ఇన్ !

గత రెండేళ్లుగా కెసిఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కే టి రామారావు హవా కొనసాగుతున్నది. అన్ని ప్రభుత్వ వ్యవహారాలలో, ఇతర మంత్రులకు సంబంధించిన అంశాలలో సహితం ఆయన మాటే చెల్లుబాటు అవుతున్నది. పార్టీ పెట్టినప్పటి నుండి కెసిఆర్ తో ఉంటూ, మొత్తం పార్టీ వర్గాలతో సన్నిహిత సంబంధం ఉండటమే కాకుండా, క్షేత్ర స్థాయిలో మంచి పట్టు ఉన్న మేనల్లుడు టి హరీష్ రావు ను సహితం కెసిఆర్ పక్కన పెట్టక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

కెసిఆర్ ప్రతిపాదించిన తృతీయ కూటమి, శాసన సభకు ముందస్తు ఎన్నికలు అన్ని కేటిఆర్ కు పట్టాభిషేకం చేయడం కోసమే అన్న ప్రచారం కుడా సాగింది. కొంగర కలాన్ లో జరిపిన `ప్రగతి నివేదన’ బహిరంగ సభ ప్రచారం అంతా కుడా కేటిఆర్ కన్నుసంనలలో జరిగింది. హరీష్ రావును అటువైపుకే రానీయలేదు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కెసిఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తారని, కేంద్రంలో ఎవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా మంత్రివర్గంలో చేరతారని, అప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి పదవిని కేటిఆర్ కు అప్పచేప్పుతారాని కుడా విస్తృతంగా ప్రచారం సాగింది.

దానితో హరీష్ రావు పార్టీని చేలేచి, బిజెపితో చేతులు కలుపుతరనే వదంతులు కుడా ప్రవేశించాయి. అయితే ఈ పరిస్థితులను చాల సహనంగా పరిశీలిస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తూ వచ్చిన హరీష్ రావు కు కొంగర కలాన్ సభ వెలవెల పోవడంతో అదృష్టం కలసి వచ్చిన్నట్లు అయింది. తిరిగి పార్టీ అధికారంలోకి రావాలంటే కొడుకు పనికిరాదని, క్షేత్రస్థాయిలో పట్టు గల మేనల్లుడు అవసరమని కెసిఆర్ గ్రహించిన్నట్లు ఉన్నారు. ఇప్పుడు తిరిగి హరీష్ రావు హావా మొదలైన్నన్నట్లు కనిపిస్తున్నది.

కొంగర కలాన్ సభలో వేదిక పైకి రాగానే కెసిఆర్ మొహంలో సంతోషం మాయమైనది. నిస్సారంగా సాగిన ఆయన ప్రసంగంలో హరీష్ రావు బాగా పనిచేస్తున్నారని అంటూ ఒక సందర్భంలో చెప్పడం తప్ప మరే మంత్రి పేరు ప్రస్తావించక పోవడం గమనార్హం. ఆ మరుసటి రోజునే తిరిగి 7వ తేదిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మరో బహిరంగ సభ నిర్వహింకాహ్డమే కాకుండా, అక్కడి నుండి ఎన్నికల ప్రచారానికి శంఖారావం ఉదాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం గమనార్హం. ఈ సభ బాధ్యతలు అన్నింటిని హరీష్ రావుకు స్వయంగా కెసిఆర్ అప్పచెప్పారు.

అభ్యర్ధుల ఎంపికలో సహితం కొద్ది రోజులుగా తండ్రి-కొడుకుల మధ్య వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. హరీష్ రావు మద్దతు దారుల పేర్లు ఏవీ జాబితాలో ఉండరాదని కేటిఆర్ పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ శాసన సభ్యులలో హరీష్ రావు పలుకుబడి కొనసాగితే తాను ముఖ్యమంత్రి పదవి చేబట్టడం అసంభవమని కేటిఆర్ భయపడుతున్నారు. అయితే ఆ విధంగా చేయడం ఆత్మహత్య సాదృశ్యం కాగలదని కెసిఆర్ గ్రహించిన్నట్లున్నారు. కొడుకు మాటను సహితం దిక్కరించక ఆయనకు తప్పలేదు.

రెండు, మూడేళ్ళుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న హరీష్‌రావు రానున్న ఎన్నికల ప్రచారంలో కీలకమై రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేయటానికి ఇప్పుడు మామకు చేదోడుగా కీలకం అవుతున్నారు. రానున్న ఎన్నికల్లో తన మద్దతుదారులు అందరికి తిరిగి టికెట్లు సాధించడంలో ఆయన సఫలమై తన రాజకీయ చతురతను నిరూపించుకున్నాడు. కొడుకుపై నమ్మకం వమ్ము కావడంతో, మేనల్లుడు హరీష్ రావుకు తగు ప్రాధాన్యత ఇస్తున్నమనే సంకేతాన్ని పార్టీ వారాలకు చేరవేయడం కోసమే వచ్చే ఎన్నికలకు పార్టీ తరపున ప్రచారాన్ని ప్రారంభిస్తున్న తొలి ప్రచారసభ నిర్వహణ బాధ్యతను ఆయన భుజస్కందాలపై ఉంచిన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇతర పార్టీలకు చెందిన 29 మంది శాసనసభ్యులను టీఆర్‌ఎస్ పార్టీలో చేరే విధంగా కృషిచేసి పార్టీ బలోపేతానికి హరీష్‌రావు చేసిన కృషి అందరికీ తెలిసిందే. అయితే, 2015 నుంచి పార్టీ పరంగా చేపట్టిన ఏ కార్యక్రమంలోనూ హరీష్‌రావుకు ప్రత్యక్షంగా ప్రమేయం కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో పార్టీ తొలిసారిగా నిర్వహించిన ప్లీనరీలో ఆయనకు సరైన ప్రాధాన్యత కల్పించలేదు. 2016 లో జరిగిన హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ ఆయనకు ఏ బాధ్యతలు అప్పగించకుండా మొత్తం ఎన్నికల ప్రచార బాధ్యతను కెసిఆర్ తన కుమారుడు కేటీఆర్‌కు అప్పచెప్పారు.

అదే సమయంలో జరిగిన మెదక్ జిల్లా నారాయణఖేడ్ శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని మాత్రం హరీష్‌రావుకు అప్పచెప్పి ఒక్క నియోజక వర్గానికే ఆయన్ను పరిమితం చేశారు. 2016లో ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక నిర్వహణ బాధ్యతను కూడా కేటీఆర్‌కే అప్పచెప్పారు. అయితే ఆ ఎన్నికల సమయంలో అవసరమైన మెజార్టీ రావటం కష్టంగా ఉందని నివేదికలు అందడంతో రెండు రోజుల పాటు పాలేరు నియోజక వర్గంలో హరీష్‌రావు చేత విస్త్రతంగా ప్రచారం చేయించారు.

ఉద్యమ సమయంలో ఏ విధమైన సంక్షోభం ఏర్పడినా హరీష్‌రావు ముందుండి సమస్య పరిష్కారానికి కృషి చేసేవారు. 2004లో సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన హరీష్‌రావు పార్టీ కార్యాలయం నిర్మాణం నుంచి పార్టీ తరఫున ప్రభుత్వ వ్యవహారాలు నడిపేవరకు అన్నీ తానే వ్యవహరించేవారు. అందుకనే ఎన్నికల సమరానికి వెడుతున్న సమయంలో మేనల్లుడు తన చెంత ఉండటం అవసరమని కెసిఆర్ గ్రహించిన్నట్లు కనిపిస్తున్నది.