గొడుగులు, రెయిన్ కోట్లతో బీజేపీ నిరసన

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వినూత్నంగా నిరసన తెలిపారు. వెలగపూడిలోని అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, ఆకుల సత్యనారాయణ, పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్ గొడుగులు పట్టుకుని, రెయిన్ కోట్‌లు ధరించి హాజరయ్యారు. మీ

డియా పాయింట్ వద్ద గొడుగులు ప్రదర్శిస్తూ సచివాలయం, అసెంబ్లీ అంతా చిన్నపాటి వర్షాలకే లీకులమయంగా మారిందని, ముందు జాగ్రత్తగా గొడుగులు, రెయిన్ కోట్‌లు తెచ్చుకున్నామంటూ చమత్కరించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ సాధించారని విమర్శించారు.

టీడీపీ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని, వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం చిన్నపాటి వర్షాలకే జలాశయాన్ని తలపిస్తుండటం ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రతి నిర్మాణాన్ని టెక్నాలజీ పేరుతో త్వరితగతిన నిర్మిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి నాశిరకం నిర్మాణాలకు సచివాలయం, అసెంబ్లీ ఉదాహరణగా పేర్కొనవచ్చని అంటూ ఎద్దేవా చేసారు.