స్వలింగ సంపర్కం అసహజం : ఆర్ఎస్ఎస్

స్వలింగ సంపర్కం, స్వలింగ వివాహాలు నేరమయం కాకపోయినా అసహజమని సుప్రేం కోర్ట్ తీర్పుపై స్పందిస్తూ ఆర్ఎస్ఎస్ తన వైఖరిని స్పష్టం చేసింది. స్వలింగ వివాహాలు ప్రకృతి విరుద్ధమనీ, అలాంటి సంబంధాలు ఏమాత్రం వాంఛనీయం కానందునే తాము స్వలింగ వివాహాలకు మద్దతివ్వడం లేదని స్పష్టం చేసింది.

ఇద్దరు వయోజనుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఇది ఐపీసీ సెక్షన్ 377 పరిధిలోకి రాదని కూడా సుప్రీం స్పష్టం చేసింది.  ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ప్రచార్ ప్రముఖ్ అరుణ్ కుమార్ స్పందిస్తూ  తాము కూడా సుప్రీంకోర్టు చెప్పినట్టు స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం లేదని తెలిపారు.

“అయితే స్వలింగ వివాహాలు లేదా అలాంటి సంబంధాలు ప్రకృతి విరుద్ధం. అవి ఏమాత్రం వాంఛనీయం కాదు. అందుకే మేము అలాంటి సంబంధాలకు మద్దతు ఇవ్వడం లేదు..’’ అని పేర్కొన్నారు. వాస్తవానికి సంప్రదాయ పరంగా కూడా భారత సమాజం ఇలాంటి సంబంధాన్ని గుర్తించదని తెలిఅప్రు. ‘‘సాధారణంగా ఓ వ్యక్తి దీన్ని అనుభవపూర్వకంగానే నేర్చుకోగలుగుతాడు. ఎందుకంటే ఇది సామాజిక, మానసిక స్థాయిల్లో ఆలోచించాల్సిన విషయం..’’ అని అరుణ్ పేర్కొన్నారు.