సుప్రేం తీర్పుపై స్వామి అసంతృప్తి

గే సెక్స్‌పై సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పుపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. పరస్పర సమ్మతితో వయోజనులు. గోప్యంగా స్వలింగ సంపర్కం చేసుకోవడం నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ తీర్పు అంతిమం కాదని సుబ్రహ్మణ్యం స్వామి చెప్పారు. దీనిపై అపీలు చేయడానికి అవకాశం ఉందని తెలిపారు. నేటి తీర్పు అంతిమ తీర్పు కాదని, ఏడుగురు సభ్యుల ధర్మాసనం దీనిని రద్దు చేయవచ్చునని పేర్కొన్నారు.

సమ్మతితో స్వలింగ సంపర్కం చేయడం నేరం కాదని తీర్పు చెప్పడం వల్ల సాంఘిక దురాచారాలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లైంగిక సంక్రమణ వ్యాధులు పెరుగుతాయని హెచ్చరించారు.  హోమో సెక్సువాలిటీ అనేది జన్యుపరమైన రుగ్మత అని ఆరోపించారు. హెచ్ఐవీ కేసులు పెరగడం వంటి సమస్యలకు ఈ తీర్పు దారి తీసే అవకాశం ఉందని తెలిపారు.