ఎమ్మె ల్యే పదవికి రేవంత్ రాజీనామా

తన ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ నేత ఎరేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో తన రాజీనామా లేఖను రాయగా స్పీకర్‌ను కలిసేందుకు రేవంత్ ప్రయత్నించారు. కానీ, అందుకు స్పీకర్ అంగీకరించకపోవడంతో తన లేఖను సంబంధిత కార్యాలయంలో అందజేశారు.

అయితే కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన గాడిలో లేదని, అందుకే, నిరసన వ్యక్తం చేస్తూ తన పదవికి రాజీనామా చేశానని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీకి రద్దు చేయడానికి కొద్దిసేపు ముందటే ఆయన తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.

గతంలో కాంగ్రెస్ లో చేరుతున్నప్పుడు తన రాజీనామా లేఖను టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు సమర్పించానని, ఆయన తన వద్దనే ఉంచుకొని, స్పెకర్ కు పంపక పోవడంతో ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇంతకాలం జీత భత్యాలు తీసుకోవడం లేదని, తన గన్ మెన్ లను కుడా వెనుకకు పంపించి వేశానని చెప్పారు.