`ఇంటర్' ఆత్మహత్యలపై రాష్ట్రపతికి బిజెపి ఫిర్యాదు

ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల్లో బాధ్యులపై చర్యలు చేపట్టకుండా, జరిగిన తప్పుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ దత్తాత్రేయ ధ్వజమెత్తారు. బాధ్యులైన ఇంటర్‌బోర్డు అధికారులను కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రయత్నించడంతోపాటు మంత్రిని వెనుకేసుకొస్తున్నారని దుయ్యబట్టారు. త్రిసభ్య కమిటీ నివేదికనూ అమలు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. 

ఈ వ్యవహారంపై 7, 8 తేదీల్లో దిల్లీలో రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని దత్తాత్రేయ చెప్పారు. రాష్ట్రంలో ఈమధ్య కాలంలో అమ్మాయిలపై లైంగిక వేధింపులు, ఆత్మహత్యలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. హాజీపూర్‌ ఘటన, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను గవర్నర్‌కు, జాతీయ మహిళా కమిషన్‌కు బిజెపి  ఫిర్యాదు చేస్తుందని చెప్పారు.