గాంధీ-నెహ్రూల కుటుంబం ప్రత్యేకత ఏమిటి !

గాంధీ-నెహ్రూల కుటుంబం ముందు కొందరు పేరున్న నాయకులు చేతులు కట్టుకుని నిలబడుతున్నారని, ఆ కుటుంబ ప్రత్యేకత ఏమిటని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి ప్రశ్నించారు. 

‘మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ తనను తాను రాజా అని చెప్పుకుంటారు. మరోవైపు, సోనియా గాంధీ ఇంటి ముందు ఆయన క్యూలో నిలబడతారు. ఎన్డీ తివారీ... సంజయ్‌ గాంధీ బూట్లను పట్టుకున్నారు. పెద్ద పెద్ద నాయకులు ఇందిరా గాంధీ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఆ కుటుంబ ప్రత్యేకత ఏంటీ?’ అని నిలదీశారు.

‘ఆ కుంటుంబంలోని వ్యక్తుల పేర్ల గాంధీ అనే పదం మహాత్మా గాంధీ నుంచి రాలేదు.. ఫిరోజ్‌ గాంధీ నుంచి వచ్చింది. జవహర్‌ లాల్‌ నెహ్రూకి, ఫిరోజ్‌ గాంధీ సత్సంబంధాలు ఉండేవి కాదు. అసలు వారి పేర్ల చివర గాంధీ అని పెట్టుకునే హక్కు కూడా లేదు' అని ఆమె స్పషటం చేశారు. 

ఈ పేరు ఉంటే తమకు గౌరవం లభిస్తుందని వారు భావించారని, అయితే మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ప్రధాని మోదీ మాత్రమే నడుస్తున్నారని ఉమా భారతి పేర్కొన్నారు. తాము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేస్తామని ఆమె తెలిపారు.