తెలుగు దేశం పాలనలో జరుగుతున్న అవినీతి, అరాచకాలపై ప్రజాభిప్రాయ సేకరణకు సిద్దమా అని బిజెపి రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సవాల్ విసిరారు. లేదా సిబిఐ విచారణకు సద్దామా అని నిలదీశారు. వారానికి ఇదు ప్రశ్నలు చొప్పున ముఖ్యమంత్రిపై సంధిస్తున్న కన్నా తాజాగా తన పదో లేఖలో మరో ఇదు ప్రషణలు వేసారు. ఇప్పటి వరకు వేసిన 50 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.
తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో అవినీతి రహిత, సుపరిపాలనను అందిస్తామని వాగ్దానం చేశారని గుర్తు చేసారు. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి ‘మా ప్రజా ప్రతినిధులు గానీ, మా నాయకులు గానీ చేసిన ఒక్క అవినీతి పనినైనా చెప్పగలరా’ అని ప్రజలను అడిగే ధైర్యం ఉందా? అని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. మీ ఎంఎల్ఏ, ఎంపీ, ఎంఎల్సీల అవినీతి అరాచకాలపై ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమా అని అడిగారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదట ర్యాంక్ వచ్చిందని ముఖ్యమంత్రి ప్రచారం చేసుకోవడాన్ని ఎద్దేవా చేసారు. ఈ నాలుగు సంవత్సరాలలో మీ పచ్చ నాయకులు, ప్రజా ప్రతినిధులు తమవి గానీ తమకు సంబంధించినవి గానీ ఎన్ని పరిశ్రమలను, వ్యాపారాలను ఇతర రాష్ట్రాలలో పెట్టారు? మన రాష్ట్రంలో ఎన్ని పెట్టారు? నిజాయతీగా ప్రజలకు ఈ వివరాలు చెప్పగలరా అని ఇలాదీసారు.
బీజేపీ మీద కోపంతో బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పకూల్చాలని ప్రయత్నించడం లేదా? తద్వారా కోట్లాది ప్రజలను గందరగోళంలోకి నెట్టాలని చూడటం లేదా? డిమానిటైజేషన్, డిజిటల్ కరెన్సీని బహిరంగంగా బలపరచి, ఈ మధ్య కాలంలో కావాలని కుట్రపూరితంగా బ్యాంకింగ్ వ్యవస్థ మీద బాధ్యతారాహిత్య ప్రకటనలను చేస్తూ ప్రజలలో లేనిపోని అనుమానాలు లేవనెత్తుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం లేదా?. అని చంద్రబాబునాయుడును ప్రశ్నించారు.
రాజ్యంగపదవిలో ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు చేయవలసిన పనేనా ఇది? మీ కుట్రపూరిత ప్రకటనల వల్ల ఒక్కసారిగా బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలితే ఈ దేశం, ప్రజలు ఏమి కావాలి.. మీ స్వార్థం కోసం ద్రోహం చేయవచ్చా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
వెనకబడిన జిల్లాల అభివృద్ధికి అహర్నిశలూ పాటుబడుతున్నామని చెప్పే చంద్రబాబునాయుడు వెనకబడిన విజయనగరం జిల్లా అభివృద్ధిని తుంగలో తొక్కలేదా అని ప్రస్తావించారు. సాగునీటికి తాగునీటికి ఎంతో ముఖ్యమైన తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు అటక ఎక్కిన వాస్తవం కాదా అని అడిగారు.
తోటపల్లి రిజర్వాయర్ ఫీల్డ్ చానల్స్‌ను పూర్తి చేయలేదని, వెంగళరావు సాగర్ అదనపు ఆయకట్టు పెంపుదల పక్కన పెట్టేశారని తెలిపారు. తెలుగు దేశం ఎన్నికల ప్రణాళికలో పెట్టిన సాలూరు బైపాస్‌ను మర్చిపోయారని చెప్పారు. జిల్లాలోని జూట్ మిల్లులను తెరిపించడంతో విఫలమై 10 వేల మంది కార్మికుల భవితవ్యాన్ని చీకట్లోకి నెట్టేసిన ఘనత మీది కాదా అని ప్రశ్నించారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు మీకుందా? అని నిలదీశారు.
ఎంతో వెనకబడిన ప్రకాశం, వైఎస్సార్ జిల్లాలకు వరప్రసాదిని అయిన వెలుగొండ ప్రాజెక్టు ఈరోజుకీ పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం మీది కాదా? అని అడిగారు. 4.59 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించే అత్యంత ప్రాధాన్యత గల ఈ ప్రాజెక్టునే పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు ఉందా? అంటూ మండిపడ్డారు.