లైంగిక వేధింపుల వివాదంలో సిపిఎం ఎమ్యెల్యే!

అసలకే అసాధారణమైన వరదల భీబత్సహంలో సకాలంలో స్పందించక పోవడంతో దారుణమైన ముప్పు ఎర్పడినదని ఒక వంక, సహాయ-పునరావ కార్యకలాపాల నిర్వహణలపై విమర్శలతో మరోవంక ఆత్మరక్షణలో పడిన కేరళలోని సిపియం తాజాగా తమ పార్టీకి చెందిన ఒక శాసన సభ్యుడు లైంగిక వేధింపుల వివాదంలో చిక్కుకోవడం మరో తలనొప్పి కలిగిస్తున్నది. పైగా, తమ పార్టీ యువజన విభాగంకు చెందిన ఒక నాయకురాలిపైననే ఈ దురాగతానికి దిగడం, ఆమె ఫిర్యాదు చేసిన మూడు వారాలకు గాని పార్టీ స్పందించక పోవడంతో విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ విషయమై పార్టీ కేంద్ర నాయకత్వంలో సహితం విబెధాలకు దారితీస్తున్నట్లు కనబడుతుంది.

పార్టీ యువజన విభాగంకు చెందినా ప్రజాస్వామ్య యువజన సమాఖ్య నాయకురాలు ఒకామె తనను ఎమ్యెల్యే పి కే శశి లైంగికంగా వేధించారంటూ గత నెలలోనే జిల్లా, రాష్ట్ర కమిటీలకు ఫిర్యాదు చేసారు. వారు పట్టించుకొనక పోవడంతో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు బ్రిందా కారత్ కు ఆ ఫిర్యాదును ఆగష్టు 14న పంపారు. ఆమె కుడా స్పందించక పోవడంతో చివరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సోమవారం ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు పంపారు.

ఏచూరి వెంటనే స్పందించి విచారణ జరిపి, తగు చర్య తీసుకోమని రాష్ట్ర పార్టీని ఆదేశించిన్నట్లు మీడియాకు చెప్పడంతో పార్టీ నాయకత్వం ఇబ్బందులలో పదిన్నట్లయింది. ఎందుకంటె వచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర పార్టీకి `ఆదేశం’ పంపిన్నట్లు పత్రికలలో వచ్చిన కధనాలు వాస్తవం కాదని, ఈ విషయంలో కేంద్ర పార్టీ జోక్యం చేసుకోవడం లేదని అంటూ కేంద్ర నాయకత్వం మరోవంక మీడియాకు తెలిపింది.

అయితే ఈ ఫిర్యాదు తనకు అందినదని, వెంటనే తగు చర్య కోసం రాష్ట్ర పార్టీకి పంపానని ఏచూరి ఢిల్లీలో చెప్పారు. ఇప్పటికే విచారణ పక్రియ ప్రారంభమైన్నట్లు చెప్పారు. తనను లైంగికంగా వేధించడమే కాకుండా తనకు ఫోన్ లు చేసి అసభ్యంగా మాట్లాడారని కుడా ఆ శాసన సభ్యుడిపై యువ నాయకురాలు ఫిర్యాదు చేసారు. ఆయన టెలిఫోన్ సంభాషణలను ఆమె రికార్డు కుడా చేసారు.

అయితే ఈ ఫిర్యాదు గురించి తనకు తెలియదని అంటూ ఇదంతా కుట్రపూరితంగా తనను రాజకీయంగా అణగద్రొక్కడం కోసం వేస్తున్న ఎత్తుగడగా ఆరోపించారు. తనకు మూడు వారల క్రితమే ఫిర్యాదు వచ్చిన్నట్లు చెప్పిన రాష్ట్ర పార్టీ కార్యదర్శి కోడియరి బాలకృష్ణన్ ఈ విషయమై ఎటువంటి చర్య తీసుకొంతున్నమో అనే విషయమై మాత్రం స్పందించడం లేదు. ఈ విషయమై ఫిర్యాదును పోలీస్ కు అందిచ్చే అవకాశాన్ని త్రోసిపుచ్చారు. “ఆమె పార్టీకి ఫిర్యాదు చేసారు గాని పోలీస్ కు కాదు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఈ కేసును వెంటను పోలీస్ లకు అప్పచేప్పాలని, కేసు నమోదు చేసి ఎమ్యెల్యేను అరెస్ట్ చేయాలనీ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎమ్యెల్యే తన పదవికి రాజీనామా చేయాలనీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతిక సుభాష్ దేమద్న్ చేయగా, పోలీస్ లు కేసు నమోదు చేసి, అతనిని అరెస్ట్ చేయాలనీ యువజన కాంగ్రెస్ అద్యక్షుడు డీన్ కురిఅకోసే కోరారు. పోలీస్ లకు ఫిర్యాదును అందజేయకుండా సిపిఎం నాయకులు తాత్సర్యం చేయడం పట్ల బిజెపి నాయకుడు కే సురెంద్రన్ మండిపడ్డారు.