ఏపీలో సీఎం, సీఎస్ పోటా పోటీ సమీక్షలతో అధికారుల ఇరకాటం

ఆంధ్ర ప్రదేశ్ లో అనూహ్యంగా ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకొని నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, ఈ నియామకం పట్ల విముఖంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నది. ఒకే అంశంపై పోటీ పోటీగా ఎవ్వరికీ వారుగా సమీక్షా సమావేశాలు జరుపుతూ ఉండటందో  అధికారులు ఇరకాటంలో పడుతున్నారు.

పోలింగ్ పూర్తయ్యే వారికి సుబ్రహ్మణ్యం నియామకం పట్ల మౌనంగా ఉన్న ముఖ్యమంత్రి, తర్వాత ఆయన ప్రతిపక్ష నేత జగన్ కోవర్ట్ అని, అవినీతి కేసులో జగన్ తో పాటు సహా ముద్దాయి అంటూ తీవ్రమైన వాఖ్యలు చేశారు. దానితో ఆగ్రహం చెందిన కొందరు మాజీ ఉన్నతాధికారులు హై కోర్ట్ సుబ్రమణ్యంను ఆ కేసులో నిర్దోషిగా తేల్చినదని, దోషి అని యెట్లా అంటరాని అంటూ చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు.

అయితే హై కోర్ట్ కేసులోనుంచి తీసివేసినా సిబిఐ సుప్రీం కోర్ట్ లో అప్పీల్ చేసినదాని, మే 10న అక్కడ విచారణ జరుగనున్నది అంటూ టిడిపి వర్గాలు పేర్కొన్నాయి. సాధారణంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి, మంత్రులు అధికారులతో సమీక్ష సమావేశాలు జరిపారు. కానీ చంద్రబాబు బుధవారం సమీక్షలు జరపడంతో అధికార యంత్రాంగం ఇరకాటంలో పడింది.

బుధవారం రాష్ట్రంలో తాగునీరు, వేసవి కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, ఒకేసారి సమీక్షలు నిర్వహించారు. రెండు కార్యక్రమాలకూ అధికారులు హాజరయ్యారు. అయితే సిఎస్‌ కార్యక్రమంలో నిధుల విడుదలకు సంబంధించి అన్ని చర్యలూ తీసుకున్నామని, యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు ఎప్పుడు ఇస్తే అప్పుడు నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలోనూ కొంచెం అటుఇటుగా ఇవే అంశాలు చర్చకు వచ్చాయి. 

సిఎస్‌గా బాథ్యతలు స్వీరించిన తరువాత సుబ్రహ్మణ్యం, చంద్రబాబు ఇంతవరకూ ఏ సమావేశంలోనూ కలవలేదు. ఎన్నికలు ముగిసిన అనంతరం నిర్వహించిన పోలవరం, కరువు సమీక్షల్లోనూ మర్యాద పూర్వకంగా కలుసుకుంటారని అనుకున్నా అదీ జరగలేదు. దీంతో అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. 

ఫలితాలు వచ్చే వరకూ ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడి ఉండాల్సిందేనని, అలా అయితే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి వెళ్లాలా ? లేదా అనే అంశంపై అధికారులు సందిగ్ధంలో పడ్డారు.