‘అబ్‌కీ బార్ చార్-సౌ పార్’ ... న్యూయార్క్ లో ప్రచారం

భారత దేశంలో వేడెక్కిన లోక్‌సభ ఎన్నికలు అమెరికాలోని ప్రవాస భారతీయులను సైతం కదిలిస్తున్నాయి. జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ధి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ వంటి అంశాలకే ప్రవాస భారతీయులు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇటీవల వివిధ పార్టీల తరపున న్యూయర్క్‌లో భారతీయ సంతతి ప్రచారం చేపట్టింది. 

‘అబ్‌కీ బార్ చార్-సౌ పార్’ (ఈ దఫా 400 స్థానాలు దాటాలి) అనే నినాదాలతో న్యూయార్క్‌లో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు దారులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫైర్స్ కమిటీ అధ్యక్షుడు జగదీష్ సెహవాని ఒక సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రస్తుతం భారత దేశంలో జరుగుతున్న ఎన్నికలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పారు. 

ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుపై ఆధారపడి ఉన్నాయని ఆయన తెలిపారు. జాతీయ భద్రత అనేది బీజేపీకి అత్యంత ముఖ్యమైన అంశమని ఆయన చెప్పారు. రెండో దఫా నరేంద్ర మోదీ ప్రధాని అయితేనే దేశం ఆర్థికంగా నిలదొక్కుకుంటుందని, సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

న్యూయార్క్‌లోని ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు అమెరికాలోని వివిధ రాష్ట్రాలకు వెళ్ళి బీజేపీకి అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. న్యూజెర్సీలో ‘చౌకీదార్ మార్చ్’ నిర్వహించారు. వాషింగ్టన్, వర్జినియాలో 12 మైళ్ళు కార్ల ర్యాలీ నిర్వహించారు. డెట్రాయిట్, న్యూజెర్సీలో ‘చాయ్‌పే చర్చ’ కార్యక్రమాన్ని చేపట్టారు. 

పిట్స్‌బర్గ్, బోస్టన్, కొలంబస్, క్లెవ్‌లాండ్, చికాగో, అట్లాంట, తంప, హోస్టన్, ఆస్టిన్, లాస్‌ఏంజిల్స్, సాన్‌ఫ్రాన్సికో, సియాటిల్ తదితర ప్రాంతాల్లోనూ ఈ సంస్థ సభ్యులు విస్తృతంగా ప్రధాని మోదీకి మద్దతుగా ప్రచారం, ర్యాలీలు నిర్వహించారు. భారత్‌లో ఉన్న బంధు, మిత్రులకు ఫోన్లు చేసి బీజేపీకి ఓట్లు వేయాల్సిందిగా చెప్పాలని వారు కోరుతున్నారు. 

డెమోక్రాటిక్, సెక్యులర్ సౌత్ ఏషియా, కోయిలేషన్ ఫర్ ఏ డెమోక్రాటిక్, సెక్యులర్ సౌత్ ఏషియా, కోయిలేషన్ ఫర్ ఏ డెమోక్రాటిక్ ఇండియా, దళిత్ సాలిడారిటీ ఫోరం, (డీఎస్‌ఎఫ్), ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ వంటి సంస్థలు, అసోసియేషన్లు కూడా ఇందులో భాగస్వామ్యమైనట్లు జగదీష్ సెహవానీ తెలిపారు.