బీజేపీలో ప్రముఖ మలయాళీ నటుడు మోహన్ లాల్ !

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బీజేపీలో చేరతారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీమంత్రి శశి థరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే కధనాలు వెలువడుతున్నాయి. అయితే తన రాజకీయ ప్రవేశంపై మోహన్ లాల్ మాత్రం పెదవి విప్పడం లేదు.

జన్మాష్టమి రోజున మోహన్ లాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటి కావడం ఈ ఉహగానాలకు బలం చేకురుతున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన కేరళ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఈ నేపథ్యంలో నవ కేరళ నిర్మాణంపై నిర్వహించే ప్రపంచ మలయాళీ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా ప్రధానిని కోరిన్నట్లు మోహన్ లాల్ తెలిఅపారు. 

ఈ సమావేశంలో పాల్గొంటానని ప్రధాని అంగీకరించినట్లు మోహన్ లాల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాను నిర్వహించే విశ్వశాంతి ఫౌండేషన్ కార్యకలాపాల గురించి కుడా వివరించినట్టు పేర్కొన్నారు. అలాగే కేరళను అన్నివిధాలుగా సాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఇప్పటికే ప్రముఖ మలయాళీ నటుడు సురేష్ గోపి బిజెపిలో చేరి గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ కోసం ప్రచారం చేసారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. కేరళలో, ముఖ్యంగా బడుగు వర్గాలలో విస్తారమైన కార్యకర్తల బలం ఆర్ ఎస్ ఎస్, బిజెపి లకు ఉన్నప్పటికీ, క్రమంగా వోట్ల శాతం పెంచుకో గాలుగుతున్నప్పటికి,  రాజకీయంగా చెప్పుకోదగిన ప్రభావం చూపలేక పోతున్నారు. సీట్లు గెలవలేక పోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో మొదటి సారిగా రాస్త్రంలో పార్టీ కురువృద్దుడు ఓ రాజగోపాల్ అసెంబ్లీ కి ఎన్నికయ్యారు.

ప్రజలకు సుపరిచితులైన రాజకీయ నాయకత్వం లేకపోవడమే ప్రధాన లోపంగా కనిపిస్తున్నది. అందుకనే ప్రజలలో మంచి క్రేజ్ గల మోహన్ లాల్ ను పార్టీలో చేర్చుకోవడం పట్ల ఆర్ ఎస్ ఎస్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. రెండేళ్ళ క్రితం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్లరద్దును బహిరంగంగా మోహన్ లాల్ సమర్ధించారు. అప్పట్లోనే ఆయన బిజెపిలో చేరుతున్నట్లు పలువురు భావించారు.