మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా రేఖా శర్మ

జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా రేఖా శర్మ నియమితులయ్యారు. హర్యానాకు చెందినా 54 సంవత్సరాల వయస్సుగల ఆమె ప్రస్తుతం కమీషన్ సభ్యురాలిగా ఉంటున్నారు. గత సెప్టెంబర్ లో కమీషన్  చైర్‌పర్సన్‌గా లలితా కుమారమంగళం పదవీ విరమణ చేసినప్పటి నుండి ఆమె ఇన్ చార్జ్ చ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. 
కమీషన్ సభ్యురాలిగా ఆమె దేశంలోని పలు ప్రాంతాలలో గల మానసిక వైద్య సంస్థలను, మహిళల నిర్బంధ ప్రదేశాలను సదర్శించి, అక్కడ మహిళలు ఎదుర్కొంటున్న  పరిస్థితులను అడిగి తెలుస్తుకున్నారు. ఈ మధ్య చర్చి లలో `ఒప్పుకొనే’ సాంప్రదాయాన్ని రద్దు చేయాలనీ ప్రకటన ఇవ్వడం ద్వారా ఆమె వివాదం సృష్టించారు. 

ఈ పదవికి తనను నీయమించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఇది తనకిచ్చిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. బాధ్యతతో తన విధులను నెరవేరుస్తానని చెప్పారు. మహిళల రాజ్యాంగపరమైన, చట్టపరమైన హక్కులను కాపాడటంతో పాటు, వారి సమస్యలకు పరిష్కారాలు చూపే విధంగా మహిళా కమీషన్ తగు కృషి చేయగలదని ఆమె భరోసా ఇచ్చారు.