ఓటమిని హుందాగా స్వీకరించలేక ఏమీ గోల చంద్రబాబు !

ఓ‍టమిని హుందాగా స్వీకరించలేని నీ గోల ప్రజలు పట్టించుకోవడం లేదని అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎద్దేవా చేశారు.. ఇక పచ్చ మీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టించలేవని,  ప్రజలే నిన్ను సాగనంపడానికి బాధ్యతగా ఓటు వేశారని అంటూ ఆయన శనివారం ట్వీట్‌ చేశారు.   

 ’చంద్రబాబు...! అసలు ఈవీఎం కనిపెట్టమని చెప్పిందే నువ్వు కదా!. వీవీ ప్యాట్‌లో ఎవరికి ఓటు పడిందో చూసి కూడా ఇప్పుడు ఈ ఏడుపు ఏంటి?' అంటూ ధ్వజమెత్తారు. 

 ‘యూ టర్న్ బాబు, ఈవీఎంల విషయంలో ఆడలేక మద్దెల ఓడు లాగా ఉంది నీ వ్యవహారం.. సిగ్గు లేకుండా అవినీతి చేసి బుకాయించడం, రాజ్యాంగ సంస్థల పట్ల నమ్మకం లేకపోవడం, గుడ్డ కాల్చి పక‍్కన వాళ్లమీద వేయడం, ఎన్నికల అయిపోయినా ఇంకా ఎవరిని మభ్యపెట్టేందుకు ఈ పిచ్చి వేషాలు. ఓటమి భయం నిన్ను మరింత దిగజారేలా చేస్తోంది.’ అంటూ చంద్రబాబుపై కన్నా మండిపడ్డారు.