ముందస్తుకు దూకుడు పెంచిన కెసిఆర్

ముందస్తు ఎన్నికలపై తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావు దూకుడును పెంచారు. ఫాం హౌజ్‌లో కేసీఆర్ ముందస్తు వ్యూహ రచన చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, అసెంబ్లీ రద్దుకోసం సిఫార్సు చేయడం గురించి కసరత్తు చేస్తున్నారు. సోమవారం  సాయంత్రం హైదరాబాద్ నుంచి ఫాం హౌజ్‌‌కు చేరుకున్న కేసీఆర్ పార్టీ సీనియర్లతో అక్కడనే సమాలోచనలు జరుపుతున్నారు.

ముందస్తుకు సంబంధించి ఇప్పటికే కేసీఆర్ లాంచనాలన్నీ ఒక్కక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నారు. 6న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ సమావేశంలో ప్రభుత్వ పరంగా వివిధ కార్యక్రమాలకు సంబందిచిన ఆని అంశాలకు ఆమోద ముద్ర వేయడంతో పాటు అసెంబ్లీ రద్దుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

ఆ మరుసటి రోజున  7న హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ జరిపి అక్కడ రాజకీయ కార్యాచరణను ప్రకటించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే  హుస్నాబాద్‌లో జరగనున్న సభ ఏర్పాట్ల గురించి మంత్రులు హరీష్‌రావు‌, ఈటల రాజేందర్‌ల‌కు కేసీఆర్ అప్పగించినట్లుగా తెలియవచ్చింది. శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో మంచిదన్నభావనతో ఆ రోజు నుంచి సభలు, సమావేశాలు నిర్వహించుకుంటే బాగుంటుందని జ్యోతిస్కులు కేసీఆర్‌కు చెప్పినట్లుగా చెబుతున్నారు.

ఈ క్రమంలో కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి కూడా కార్యకాహరణ రూపొందిస్తున్నారు. మొత్తం 50 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటనలు చేయనున్నారు.

http://wtf2.forkcdn.com/www/delivery/lg.php?bannerid=0&campaignid=0&zoneid=4613&loc=http%3A%2F%2Fwww.manamnews.com%2Fcontent%2Fkcr-plans-early-polls-25300&referer=http%3A%2F%2Fwww.manamnews.com%2F&cb=5463638a51 కాగా మరోవైపు తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి అత్యున్నత సమావేశం జరిపారు. అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాజీవ్ శర్మ, సీఎంవో ప్రిన్సిపల్ కార్యదర్శి నర్సింగ్‌రావు ఈ భేటీలో పాల్గొన్నారు.

ఆ తర్వాత ఈ అధికారులు గవర్నర్ నరసింహన్ ను కలిసారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ ప్రధాన కార్యదర్శితో సమావేశం కావడం ఆసక్తి కలిగిస్తున్నది. ముందుస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్న సమయంలో ఈ భేటీలు  ప్రాధాన్యత సంతరించుకుంది.