దీపక్ మిశ్రా వారసుడిగా రంజన్ గగోయి

తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి నీయమకంపై చెలరేగుతున్న ఉహాగానలకు తెరదించుతూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తన వారసుడిగా తన తర్వాత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ రంజన్ గగోయి పేరును ప్రతిపాదించారు. దీపక్ మిశ్ర పదవీకాలం అక్టోబర్ 2న ముగియనున్నది. అయితే అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా సెలవు దినం కావడంతో, ఆయన ఆ ముందురోజే పదవీ విరమణ చేయనున్నారు. అక్టోబర్ 3న కొత్త న్యాయమూర్తి పదవీ బాధ్యతలు చేపట్టవలసి ఉంది.

తన ఉద్యోగ విరమణకు నెలరోజుల ముందే తన వారసుడిని నీయమించ వలసిన జస్టిస్ దీపక్ మిశ్రా తన సిఫారసుతో కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ప్రధాన న్యాయమూర్తిగా రెండవ సీనియర్ జడ్జి రంజన్ గగోయ్‌ను నియమించాలంటూ దీపక్ మిశ్రా ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. అక్టోబర్ 2న సెలవు దినం కావడం వల్ల, అక్టోబర్ ఒకటవ తేదీనే దీపక్ మిశ్రా రిటైర్‌కానున్నారు. అక్టోబర్ మూడవ తేదీన రంజన్ గగోయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

నవంబర్ 17 వరకు గగోయ్ ఆ బాధ్యతలో కొనసాగుతారు. మాస్టర్ రోస్టర్ విషయంలో గతంలో గగోయ్ చీఫ్ జస్టిస్ మిశ్రాను తప్పు పట్టారు. 2012లో సుప్రీంకోర్టు జడ్జిగా గగోయ్ ప‌దోన్న‌తి సాధించారు. 1954లో గగోయ్ జన్మించారు. 1978లో ఆయన బార్ కౌన్సిల్‌లో సభ్యుడయ్యారు. 2001, ఫిబ్రవరి 28న ఆయన గౌహతి హైకోర్టులో పర్మినంట్ జడ్జిగా నియమితుడయ్యారు. 2010 సెప్టెంబర్‌లో పంజాబ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.