ఖాళీ కుర్చీని ఫోటో తీసాడని జర్నలిస్ట్ ను చితక బాదారు

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలు, రోడ్‌షోలకు జనాదరణ అంతంతమాత్రంగానే ఉంటోంది. తాజాగా తమిళనాడులో నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచార సభకు జనం రాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ సభకు వచ్చిన ఫొటో జర్నలిస్ట్‌ ఒకరు ఖాళీగా ఉన్న కుర్చీలను ఫొటో తీసేందుకు యత్నించారు. 

దీంతో అక్కడున్న కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఆ జర్నలిస్ట్‌పై దాడికి దిగారు. కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి నుంచి అతన్ని సహచర పాత్రికేయులు కాపాడారు. రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తోపులాట జరగడంతో పలువురు జర్నలిస్ట్‌లకు గాయాలయ్యాయి. బాధితుడు తమిల్‌ వీక్లీ మ్యాగజైన్‌కు చెందిన జర్నలిస్ట్‌ ఆర్‌ఎం ముత్తురాజ్‌గా గుర్తించారు. గాయపడిన ముత్తురాజ్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 ఈ ఘటన శనివారం తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి ఈ బహిరంగ సభకు హాజరుకావాల్సి ఉంది. కాంగ్రెస్‌ కార్యకర్తలు గుండాల్లా వ్యవహరించారని బీజేపీ నాయకులు మండిపడ్డారు.