వంశపారంపర్యను జీర్ణించుకోలేకనే కాంగ్రెస్‌ను వీడా

నాలుగుదశాబ్దాలు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగానని చెబుతూ గతంలోని ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలను ప్రస్తుత తరం వారితో పోల్చలేమని మాజీ కేంద్ర మంత్రి ఎస్ ఏం కృష్ణ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో వంశపారంపర్యమనేది ఆలస్యంగా జ్ఞానోదయం కలిగిందని  బెంగళూరులో మీట్‌ ది ప్రెస్‌లో ఆయన తన మనసులోని భావాలను వ్యక్తం చేశారు. సుధీర్ఘ కాలం కాంగ్రెస్‌లో కొనసాగానని అయితే వంశపారంపర్యను జీర్ణించుకోలేకనే కాంగ్రెస్‌ను వీడానని వెల్లడించారు.

రాజీవ్‌గాంధీకు కొన్ని ఆశయాలు ఉండేవంటూనే రాహుల్‌గాంధీను ఏవిధంగాను పోల్చుకోలేమంటూ మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి దాటవేశారు. గుజరాత్‌ సీఎంగా కొనసాగినా, ఏకంగా ప్రధానమంత్రి వంటి కీలక పదవిలో ఉన్నా నరేంద్ర మోదీ కుటుంబ సభ్యులను రాజకీయాల వైపు తీసుకురాలేదని గుర్తు చేశారు. ఇప్పటికీ మోదీ కుటుంబీకులు సాధారణంగానే జీవిస్తున్నారని చెప్పారు.

ఐదేళ్ళ పాలనలో అవినీతి రహితమనిపించారంటూ కృష్ణ కొనియాడారు. ప్రపంచ బ్యాంకు సైతం భారత్‌ ఆర్థికంగా పురోగతి చెందుతోందని కితాబునిచ్చారని గుర్తు చేశారు. బీజేపీను నరేంద్రమోదీను వేరు చేయలేమని చెబుతూ నోట్లరద్దు చారిత్రాత్మకమైనదని కొనియాడారు.

విదేశీవ్యవహారాల శాఖామంత్రిగా రెండుసార్లు పాకిస్తాన్‌లో పర్యటించానని పేర్కొంటూ అక్కడి ప్రజాస్వామ్యం పేరుకుమాత్రమేనని, సరిహద్దు నిర్ణయాలు మిలటరీతో పాటు ఐఎ్‌సఐ సంస్థలే తీసుకుంటాయని తెలిపారు. పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పిన సత్తా మోదీకే ఉన్నదని స్పష్టం చేశారు.

కాంగ్రె్‌సలో ఎన్నో అవమానాలు ఎదుర్క్నొట్లు ఓప్రశ్నకు సమాధానమిచ్చారు. చైనా పర్యటనలో ఉండగానే మంత్రి పదవిని తప్పించి మహారాష్ట్రాకు గవర్నర్‌గా నియమించారని కనీసం భారత్‌కు వచ్చేదాకా గడువు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదబు చెప్పారు.

తన కుటుంబీకులు రాజకీయాలలోకి వచ్చేది వా రిష్టమని అంటూ తాప్పుడూ ప్రోత్సహించనని స్పష్టం చేశారు. దేవేగౌడ ఇరువురు మనవళ్ళను పోటీ చేయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బ్యాక్‌డోర్‌లో రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి పదవులు దక్కించుకున్న వారెవరనేది తెలిసిందేనని పరోక్షంగా కుమారస్వామిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

1999=2004ల మధ్యన కర్ణాటక ఏస్థాయిలో అభివృద్ది చెందిఉందనేది తెలిసిందేనని అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ పోటీ పడిందని ఓప్రశ్నకు సమాధానమిచ్చారు. రుణమాఫీ పథకం కళ్ళులేని వారు ఏనుగు గురించి వర్ణించినట్లే అని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితి మార్పు సాధ్యమే అని భరోసా వ్యక్తం చేశారు.

ఐటీ దాడులను రాజకీయం చేయరాదని హితవు చెప్పారు. బీజేపీలోకి చేరాకనే తన అల్లుడిపైనా దాడి జరిగిందని,  ఇది పార్టీ ఇచ్చిన రివార్డు అన్నారు. రాజకీయాలలో విలువలు ఉండాలను చెప్పారు.