మాయావతి బీఎస్పీ టికెట్లు అమ్ముకున్నారు

మాయావతిపై కేంద్రమంత్రి, సుల్తాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిని మనేకాగాంధీ సంచలన ఆరోపణలు చేశారు. బీఎస్పీ పార్టీ అధినేత్రి మాయావతి ఒక్కో లోక్‌సభ సీటును 15 నుంచి 20 కోట్లరూపాయలకు విక్రయించారని మనేకాగాంధీ ఆరోపించారు.

మాయావతి పార్టీ టికెట్లు విక్రయించారని విషయం అందరికీ తెలుసునని,ఈ విషయాన్ని వారి పార్టీ కార్యకర్తలు గొప్పగా చెప్పుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. సుల్తాన్ పూర్ లో జరిగిన బహిరంగ సభలో మనేకాగాంధీ మాట్డుతూ  మాయావతికి 77 ఇళ్లు ఉన్నాయని, ఆమె వజ్రాలు, లేదా నగదు రూపంలో లంచాలు తీసుకుంటారని మనేకా ఆరోపించారు.

పార్టీ టికెట్టు కొనటానికి రూ.20 కోట్లు ఎక్కడినుంచి వచ్చాయని, ఆ డబ్బు సామాన్య ప్రజలది కాదా అని ఆమె ప్రశ్నించారు. కేంద్రమంత్రి మనేకాగాంధీ సుల్తాన్‌పూర్ నుంచి, ఆమె కుమారుడు వరుణ్ గాంధీ ఫిలిబిత్ నుంచి బీజేపీ అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం పాఠకులకు విదితమే.